Advertisementt

9 గంటల 51 నిమిషాలలో వైట్ పేపర్ సినిమా

Fri 24th Sep 2021 08:57 PM
white paper,white paper movie,white paper movie stills  9 గంటల 51 నిమిషాలలో వైట్ పేపర్ సినిమా
White Paper movie in the Indian Book of Records 9 గంటల 51 నిమిషాలలో వైట్ పేపర్ సినిమా
Advertisement
Ads by CJ

9 గంటల 51 నిమిషాల వ్యవధిలో రెండు గంటల వైట్ పేపర్ సినిమా, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో అదిరే అభి వైట్ పేపర్ సినిమా.

జి.ఎస్.కె  ప్రొడక్షన్స్ పతాకంపై శివ దర్శకత్వం గ్రందే శివ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం వైట్ పేపర్ (White Paper). ప్రభాస్ హీరో గా నటించిన ఈశ్వర్ చిత్రంలో ప్రభాస్ ఫ్రెండ్ గా తన నట జీవితాన్ని ప్రారంభించిన అభినయ కృష్ణ, ఎన్నో చిత్రాల్లో నటుడుగా కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. జబర్దస్త్ టివి షో తో అదిరిపోయే కామెడీ పెర్ఫార్మెన్స్ తో అదిరే అభి గా ప్రసిద్ధి చెందాడు. ఇప్పుడు ఈ వైట్ పేపర్ చిత్రం తో హీరో గా పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రాన్ని కేవలం 9 గంటల 51 నిమిషాల వ్యవధిలో పూర్తి చేసారు. ఈ సందర్భంగా  ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు అరుదైన చిత్రంగా సత్కరించారు. అయితే ఈ రోజు సెప్టెంబర్ 24న మన అదిరే అభి పుట్టిన రోజు. ఈ సందర్భంగా వైట్ పేపర్ టైటిల్ లుక్ ను మనో,ఇంద్రజా, అనసూయ గార్లు విడుదల చేసారు.

ఈ సందర్భంగా మనో మాట్లాడుతూ.. వైవిధ్య కథనాలు ఎంచుకోవడంలో మా అభి ముందు ఉంటాడు, అలానే ఇప్పుడు ఈ వైట్ పేపర్ సినిమా ని కూడా డిఫరెంట్ గా చేసాడు, ఈ చిత్రం మంచి విజయం సాధించాలి అని కోరుకున్నారు.

ఇంద్రజా మాట్లాడుతూ.. సామాన్యంగా నటి నటులు తమ పాత్రలు చేస్తున్నప్పుడు ఎంతో హోమ్ వర్క్ చేస్తారు , అలాంటిది ఒక్క రోజులో అది కూడా  9 గంటల 51 నిమిషాల టైమ్ టార్గెట్ పెట్టుకొని సినిమా తియ్యడం అంటే ఇంకా మా అభి  చాలా హోమ్ వర్క్స్ చేసి ఉంటాడు, సో అభి ఇలాంటి అవార్డ్స్ ఇంకా ఎన్నో పొందాలని కోరుకుంటున్నాను.

అనసూయ మాట్లాడుతూ.. అభి ని ఎప్పటి నుంచో చూస్తున్నాను, అభి ఏదేనా చేయాలి అనుకుంటే చాలా కొత్తదనం ఉండేలా చూసుకుంటాడు, ఒక నటుడిగా తన ప్రతిభ మన అందరికి తెలుసు, ఇప్పుడు వైట్ పేపర్ సినిమాలో హీరో గా చేయడమే కాకుండా, ఆ సినిమా ని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నిలిచేలా చేయడం చాలా సంతోషంగా ఉంది, వారి టీం అందరికి శుభాకాంక్షలు.

హీరో అభి మాట్లాడుతూ.. కథ చాలా ఇంటరెస్టింగ్ గా అనిపించింది. కేవలం 9 గంటల 51 నిమిషాల సమయంలోనే సినిమా షూటింగ్ అంత పూర్తి చేయాలి అన్నప్పుడు దర్శకుడి డెడికేషన్ నచ్చింది. ఈ చిత్రానికి విడుదల ముందే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు రావటం, మా మనో గారు, ఇంద్రజా గారు, అనసూయ గారు మా చిత్రం టైటిల్ లుక్ పోస్టర్ ను విడుదల చేయటం చాలా సంతోషం గా ఉంది .

డైరెక్టర్ శివ మాట్లాడుతూ.. సస్పెన్స్ కథనంతో తెరకెక్కిన ఈ సినిమా లో అభి హీరో గా నటించారు. తను లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు, మాకు అవార్డు కూడా వచ్చేది కాదేమో, మాకు అభి అన్న ఇచ్చిన సపోర్ట్ వాళ్ళ 9 గంటల 51 నిమిషాలలో  చిత్రాన్ని పూర్తిచేసాము. అందరూ ఒక్క రోజులో ఎలా సినిమా తీయగలవు అన్నారు, అభి అన్న సపోర్ట్ తో, టీం సహకారంతో సినిమా తీయడం అవార్డు కొట్టడం, అలానే అభి అన్న పుట్టినరోజు సందర్భంగా ఇలా టైటిల్ లుక్  రివిల్ చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.

ఈ కార్యక్రమంలో  రాజశేఖర్,  శ్యామ్ ప్రసాద్ లు పాల్గొన్నారు.

అదిరే అభి ( అభినయ కృష్ణ), వాణి, తల్లాడ సాయి కృష్ణ ,నేహా, నంద కిషోర్ తదితరులు.

నిర్మాత - గ్రంథి శివ కుమార్, డైరెక్టర్- శివ,కేమేరా- మురళి కృష్ణ, ఎడిటింగ్- కె.సి.బి. హరి, సంగీతం - నవనిత్ చారి, పి.ఆర్.ఓ- పాల్ పవన్.

White Paper movie in the Indian Book of Records:

White Paper movie was completed in 9 hours and 51 minutes

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ