Advertisementt

అనుభవించు రాజా టీజర్ రివ్యూ

Thu 23rd Sep 2021 05:07 PM
anubhavinchu raja,anubhavinchu raja movie,anubhavinchu raja teaser launch  అనుభవించు రాజా టీజర్ రివ్యూ
Anubhavinchu Raja Teaser review అనుభవించు రాజా టీజర్ రివ్యూ
Advertisement
Ads by CJ

యంగ్ హీరో రాజ్ తరుణ్, డైరెక్టర్ శ్రీను గవిరెడ్డి కాంబినేషన్‌లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం అనుభవించు రాజా. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి  సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కింగ్ నాగార్జున రిలీజ్ చేసిన అనుభ‌వించు రాజా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.  

ఈ రోజు అనుభ‌వించు రాజా టీజ‌ర్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా.. అనుభవించు రాజా టీజర్ చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంది. చాలా ఎంజాయ్ చేశాను..మీకు కూడా నచ్చుతుంది. చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ అని రామ్ చరణ్ అన్నారు.

భీమవరంలో కోడి పందెం సెటప్ ను చూపిస్తూ పందెం రాయుళ్లందరికీ స్వాగతం పలకడంతో ఈ టీజర్ ప్రారంభమైంది. అనుభవించు రాజా.. అంటూ సూపర్ హిట్ ఓల్డ్ సాంగ్ ప్లే అవుతుండగా.. రాజ్ తరుణ్ ను విలాసాలకు అలవాటు పడిన జూదగాడిగా రాజ్ తరుణ్ తన స్టైల్లో ఎంట్రీ ఇస్తారు. పందెం కాయడం, బెట్టింగ్ వేయడం, గ్యాంబ్లింగ్ చేయడం, పేకాట ఆడటం, రికార్డు డ్యాన్సులు చేయడం వంటి మాస్ ఎలిమెంట్స్‌ కనిపిస్తున్నాయి.

అయినా బంగారం గాడు ఊర్లోని ఆడి పుంజు బరిలోని ఉండగా.. ఇంకొకడు గెలవడం కష్టం..అని మీసాలు తిప్పుతూ రాజ్ తరుణ్ కనిపించాడు. ఆయనలోని ఎనర్జీ మొత్తం టీజర్‌లో కనిపిస్తోంది.  ఇక టీజర్ చివర్లో నువ్వు గెలిచి నా పరువు కాపాడితే.. సాయంత్రం నీ గంప కింద నాలుగు పెట్టలు పెడతా అంటూ పందెం పుంజుతో మాట్లాడటం అలరిస్తోంది. గోపీ సుందర్ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి అతి పెద్ద బలంగా మారింది.

ఎనర్జిటిక్ గా ఉండే రాజ్ తరుణ్ కు బంగారం పాత్రకు కరెక్ట్ గా సూట్ అయ్యాడు. గోపి సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ టీజర్ కు మరో ప్రధాన ఆకర్షణ. సినిమాటోగ్రాఫర్ నగేష్ బానెల్ కెమెరా పనితనం కారణంగా గ్రామీణ వాతావరణం కలర్ ఫుల్ గా.. ప్రొడక్షన్ డిజైన్ గ్రాండ్ గా కనిపిస్తుంది.

Anubhavinchu Raja Teaser review:

Anubhavinchu Raja Teaser launch

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ