అనిల్ రావిపూడి - వెంకీ - వరుణ్ తేజ్ కాంబో లో ఎఫ్ 2 చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్లు ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఎఫ్ 3 సినిమా రాబోతోంది. ఇప్పటికే శర వేగంగా సినిమాను పూర్తి చేసేందుకు చిత్రయూనిట్ ప్రణాళిక వేసింది. ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలను తెరకెక్కించడంలో అనిల్ రావిపూడి తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. సినిమా సినిమాకి తన గ్రాఫ్‌ని పెంచుకుంటూ సూపర్‌స్టార్ మహేష్‌బాబు సరిలేరు నీకెవ్వరుతో కలెక్షన్ల వర్షం కురిపించారు అనిల్ రావిపూడి. ఇక ఎఫ్ 2 సినిమాతో నవ్వుల వర్షం కురిపించిన అనిల్ రావిపూడి..ఎఫ్ 3తో మరోసారి నవ్వించేందుకు రాబోతోన్నారు.
ఈ చిత్రం మీదున్న అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఆసాంతం నవ్వుల ఝల్లు కురిపించేలా అనిల్ రావిపూడి స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. ఎఫ్ 3 చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్‌లకు ప్రత్యేకమైన మ్యానరిజంలు, బాడీ లాంగ్వేజ్‌లను క్రియేట్ చేశారు. తమన్నా, మెహ్రీన్‌లు వెంకటేష్, వరుణ్ తేజ్ సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోన్నారు.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ హైద్రాబాద్‌లో నేడు (శుక్రవారం) ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో చిత్ర తారాగణం అంతా పాల్గొననున్నారు. మేకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇందులో నటీనటులు, టెక్నీషియన్స్ అందరి మొహాలపై చిరునవ్వుతో సెట్ అంతా కూడా సందడి వాతావరణం కనిపిస్తోంది.