దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం పెళ్లి సందDతో మరోసారి మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాతో ఆయన నటుడిగా కూడా ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ఆయన శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్‌పై కె.కృష్ణ మోహన్ రావు సమర్పణలో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
దర్శకేంద్రుడు తెరకెక్కించిన నాటి బ్లాక్‌బస్టర్ పెళ్లిసందడిలో శ్రీకాంత్ హీరో అయితే నేడు ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోణంకి డైరెక్ట్ చేస్తున్నపెళ్లిసందDలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరో అవడం విశేషం. శ్రీలీల హీరోయిన్. మంగళవారం పెళ్లి సందD టీజర్‌ను కింగ్ నాగార్జున విడుదల చేశారు. పెళ్లి సందD మూవీ చాలా పెద్ద హిట్ కావాలంటూ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.
హీరో రోషన్ స్టైలిష్ లుక్‌తో క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందనే విషయాన్ని సింపుల్‌గా చెప్పారు. అలాగే లంగా ఓణిలో హీరోయిన్ శ్రీలీలను అందంగా ప్రెజెంట్ చేశారు. హీరో, హీరోయిన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలను చూపించారు. మరో వైపు సహస్త్రకు పెళ్లి నాతోనా లేక నువ్వు తెచ్చి తొట్టి గ్యాంగ్ లీడర్‌తోనా అని హీరో రోషన్, హీరోయిన్ తండ్రి ప్రకాశ్‌రాజ్‌తో ఛాలెంజ్ చేసే సీన్‌తో సినిమాలో కేవలం ప్రేమ సన్నివేశాలే కాకుండా నువ్వా నేనా అనేలా హీరోకి, హీరోయిన్ తండ్రికి మధ్య సన్నివేశాలుంటాయని అర్థమవుతుంది. యాక్షన్ సన్నివేశాలు, పెళ్లిలో హీరో, హీరోయిన్ సహా పెళ్లి బృందమంతా కలిసి చేసే హడావుడి, హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు, కమర్షియల్ సాంగ్, ఎమోషనల్ సన్నివేశాలను చూపించారు. పెళ్లి భోజనం ఎంత చక్కగా ఉంటుందో అంతే చక్కగా మా పెళ్లి సందD సినిమా ఉంటుందనేలా టీజర్ ఉంది.
ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశాం. ఈ సినిమా నుంచి విడుదలైన రాఘవేంద్రరావు ప్రోమో, హీరో, హీరోయిన్ ప్రోమోలు, సాంగ్స్ అన్నింటికీ ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల గురించి తెలియజేస్తాం అని డైరెక్టర్ గౌరి రోణంకి తెలిపారు.