Advertisementt

బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్ ఫస్ట్ లుక్

Fri 10th Sep 2021 08:08 PM
badmashgallaku bumper offer,badmashgallaku bumper offer movie,badmashgallaku bumper offer first look,surendar reddy,raghavendra reddy,ravi chavali  బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్ ఫస్ట్ లుక్
Badmashgallaku Bumper offer first look బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్ ఫస్ట్ లుక్
Advertisement
Ads by CJ

బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్ ఫస్ట్ లుక్ టైటిల్ లోగో లాంఛ్ చేసిన స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి

ఇంద్రసేన, సంతోష్ రాజ్, మెరిన్ ఫిలిప్, ప్రగ్యా నయన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా బద్మాష్ గాళ్లకు బంపర్ ఆఫ్ ర్. యాక్షన్ థ్రిల్లర్

కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు రవి చావలి తెరకెక్కిస్తున్నారు. ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడెమీ పతాకంపై నిర్మాత అతీంద్ర అవినాష్ నిర్మిస్తున్నారు.

బద్మాష్ గాళ్లకు బంపర్ ఆఫర్ చిత్రానికి రాఘవేంద్ర రెడ్డి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. హీరో ఇంద్రసేన పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ లోగో ను దర్శకుడు సురేందర్ రెడ్డి లాంఛ్ చేశారు. మూవీ యూనిట్ కు బెస్ట్ విశెస్ తెలిపారు.

ఈ సందర్భంగా హీరో సంతోష్ రాజ్ మాట్లాడుతూ.. బద్మాష్ గాళ్లకు బంపర్ ఆఫ్ ర్ సినిమా ఈ పాండమిక్ లో మీకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది. సురేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా పాస్ లుక్ టైటిల్ లోగో లాంఛ్ అవడం గుడ్ బిగినింగ్ అనుకుంటున్నాము. అన్నారు.

దర్శకుడు రవి చావలి మాట్లాడుతూ.. బద్మాష్ గాళ్లకు ఆఫర్ సినిమా టైటిల్ లోగో విడుదల చేసిన సురేందర్ రెడ్డి గారికి థాంక్స్. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ప్రతి పది నిమిషాలకు ఒక ట్విస్ట్ ఉంటుంది. సినిమా షూటింగ్ కంప్లీట్ చేశాం. పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

యాక్షన్ తో పాటు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది అన్నారు.

చిత్ర సమర్పకులు రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ.. ఇవాళ టైటిల్ లోగోను డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు విడుదల చేయడం సంతోషంగా ఉంది. దర్శకుడు రవి చావలి గారు చాలా ఫాస్ట్ గా 30 రోజుల్లోనే ఈ మూవీని షూట్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం. మంచి

టెక్నికల్ టీమ్ బద్మాష్ గాళ్లకు బంపర్ ఆఫ్ ర్ సినిమాకు పనిచేస్తున్నారు అన్నారు.

హీరో ఇంద్రసేన మాట్లాడుతూ.. రవి చావలి లాంటి గొప్ప దర్శకుడితో పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా నా కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. సమర్పకులు రాఘవేంద్ర రెడ్డి గారి బ్యానర్ లో వర్క్ చేయడం సంతోషంగా ఉంది అన్నారు.

నవీన రెడ్డి, సత్య ప్రకాష్,‌ శుభలేఖ సుధాకర్ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్ - మార్తాండ్ కె వెంకటేష్, సినిమాటోగ్రఫీ -

విజయ్ సి కుమార్, సంగీతం - బాంబే భోలే, పీఆర్వో - జీఎస్కే మీడియా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - శేఖర్ అలవలపాటి, నిర్మాత - అతీంద్ర అవినాష్, సమర్పణ - రాఘవేంద్ర రెడ్డి, దర్శకత్వం - రవి చావలి.

badmashgallaku bumper offer,badmashgallaku bumper offer movie,badmashgallaku bumper offer first look,surendar reddy,raghavendra reddy,ravi chavali

Badmashgallaku Bumper offer first look:

Badmashgallaku Bumper offer first look launched by Dir Surendar Reddy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ