పోస్ట్ ప్రొడక్షన్ దశలో చెష్మా రాజా సెల్ఫీ రాణి
రాగిణి క్రియేషన్స్ బ్యానర్‌పై వీరేంద్రబాబు హీరోగా రూపొందుతోన్న చిత్రం చెష్మా రాజా సెల్ఫీ రాణి. గౌతమ్ కృష్ణన్ దర్శకుడు. పి.శ్రీనివాసరావు, రామ్ అవధానం నిర్మాతలు. హారర్ కామెడీ జోనర్‌లో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
ఈ సందర్భంగా.. నిర్మాతలు పి.శ్రీనివాసరావు, రామ్ అవధానం మాట్లాడుతూ ఈ చిత్రంతో వీరేంద్రబాబుని హీరోగా పరిచయం చేస్తున్నాం. హారర్ కామెడీ జోనర్ మూవీ. డైరెక్టర్ గౌతమ్ కృష్ణన్ సినిమాను చాలా బాగా తెరకెక్కించాడు. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోందీ సినిమా. అలాగే ఘనశ్యామ్ మ్యూజిక్ ఎక్స్‌ట్రార్డినరీ ఉంటుంది. ఇందులో ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేసిన ఓ సాంగ్ చిత్రానికే హైలెట్‌గా ఉంటుంది. హీరోయిన్‌గా సంచిత పాణిగ్రహీ, గౌతమ్ రాజు, జబర్దస్త్ రాజమౌళి, రామ్ అవధానం, నైమిష్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి త్వరలోనే సినిమాను విడుదల తేదీని అనౌన్స్ చేస్తాం అన్నారు.