Advertisementt

ఫ్రెండ్ షిప్.. విషెష్ చెప్పిన కింగ్ నాగార్జున‌.

Tue 07th Sep 2021 02:02 PM
friendship movie,friendship movie trailer,harbhajan singh,action king arjun  ఫ్రెండ్ షిప్.. విషెష్ చెప్పిన కింగ్ నాగార్జున‌.
Friendship Trailer Released ఫ్రెండ్ షిప్.. విషెష్ చెప్పిన కింగ్ నాగార్జున‌.
Advertisement
Ads by CJ

హ‌ర్భ‌జ‌న్ సింగ్‌, యాక్ష‌న్ కింగ్ అర్జున్ ఫ్రెండ్ షిప్ ట్రైల‌ర్ విడుద‌ల.. విషెష్ చెప్పిన కింగ్ నాగార్జున‌

ఏ ఒక్క స్త్రీనో ఒక్క‌ మ‌గాడి ప్ర‌త్యేక అస‌వ‌రం కోసం సృష్టించింది కాదు.. ఆడ‌ది అంటే మ‌నకు బాధ్య‌త ఈ అంద‌మైన విష‌యాన్ని చెప్పింది ఫ్రెండ్‌షిప్ అని అంటున్నారు శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత‌.. నిర్మాత ఎ.ఎన్ బాలాజీ. అదేంటో తెలుసుకోవాలంటే మాత్రం ఫ్రెండ్ షిప్ సినిమాను చూడాల్సిందేన‌ని ఆయ‌న అంటున్నారు. ఇండియ‌న్ మాజీ క్రికెట‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్‌, యాక్ష‌న్ కింగ్ అర్జున్ హీరోలుగా న‌టించిన చిత్రం ఫ్రెండ్ షిప్‌. జాన్ పాల్ రాజ్‌, శామ్‌ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏకకాలంలో భారీ ఎత్తున సినిమాను విడుదల చేయ‌డానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్నితెలుగులో శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత ఎ.ఎన్ బాలాజీ విడుద‌ల చేస్తున్నారు. సోమ‌వారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను హ‌ర్భ‌జ‌న్ సింగ్ విడుద‌ల చేయ‌గా..  కింగ్ నాగార్జున, హ‌ర్భ‌జ‌న్ సింగ్‌ను సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూడ‌టం ఆనందంగా ఉంద‌ని, సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. .ఫ్రెండ్ షిప్ మూవీ ఎలా ఉండ‌బోతుంద‌నే విష‌యాన్ని తెలుసుకోవాలంటే.. ట్రైల‌ర్‌ను ఓ లుక్కేయాల్సిందే..

ఏరా ఒక‌డు స్మాల్‌, ఒక‌డు మీడియం, ఒక‌డు లార్జ్‌.. నువ్వే ర‌క‌మో తెలియ‌డం లేదు క‌దరా! అని ఓ స్టూడెంట్ చెప్ప‌డంతో ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఎంట్రీ మాస్‌గా ఉంది. హీరో హ‌ర్భ‌జ‌న్‌, క‌మెడియ‌న్ స‌తీశ్‌, హీరోయిన్ ల‌పై కొన్ని కాలేజీ స‌న్నివేశాలు, సాంగ్‌ల‌తో క‌ల‌ర్‌ఫుల్ స‌న్నివేశాలున్నాయి.

ఒక అమ్మాయి ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉండ‌టం, విశ్వ‌గా న‌టించిన హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఫోన్ లొకేష‌న్ మ్యాచ్ కావ‌డంతో పోలీసులు హ‌ర్భ‌జ‌న్ స‌హా కాలేజీ స్టూడెంట్స్‌ను అరెస్ట్ చేయ‌డం, గొడ‌వ‌లు అన్నీ అస‌లు సినిమా కాన్సెప్ట్ ఎలా ఉండ‌బోతుంద‌నే విష‌యాల‌ను ట్రైల‌ర్‌లో టూకీగా చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఇక సినిమాలో న‌టించిన మ‌రో హీరో అర్జున్ లుక్ చాలా డిఫ‌రెంట్‌గా..యాక్ష‌న్ ఎలిమెంట్స్ మిక్సింగ్‌తో క‌నిపిస్తోంది. అమ్మాయిల‌ను ఏనుగు, అబ్బాయిల‌ను మావ‌టి వాడితో పోల్చి.. త‌ల్లిదండ్రులు పిల్ల‌ల పెంప‌కాన్ని ప్ర‌శ్నిస్తున్నారు. ఒక‌వైపు అమ్మాయిల గొప్ప‌త‌నాన్ని చెబుతూనే అమ్మాయిల ర‌క్ష‌ణ బాధ్య‌త స‌మాజానిదే అనే ఓ మెసేజ్‌ను ఇవ్వ‌డం కొస‌మెరుపు.

ఈ సందర్భంగా.. శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత, నిర్మాత ఎ.ఎన్ బాలాజీ మాట్లాడుతూ..  తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాషల్లో రూపొందిన ఫ్రెండ్ షిప్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు హ్యాపీగా ఉంది. నేటి సమాజంలో అమ్మాయిలను ఎలా చూస్తున్నారు. వారికెలా గౌర‌వ‌మివ్వాలి అనే అంశాన్ని కాలేజీ నేప‌థ్యంలో తెర‌కెక్కించారు మా డైరెక్ట‌ర్స్ జాన్ పాల్ రాజ్‌, శామ్‌ సూర్య. సినిమాను సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. దాదాపు పాతిక కోట్ల రూపాయ‌ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా త‌ప్ప‌కుండా వైవిధ్యంగా ఉంటుంది. రాజ‌కీయాల‌కు, కాలేజ్ స్టూడెంట్స్ మ‌ధ్య ఏం జ‌రిగింద‌నే విషయాన్ని ఆస‌క్తిక‌రంగా, క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో ఎంగేజింగ్‌గా ఉంటుంది. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేస్తాం అన్నారు.

Friendship Trailer Released:

Harbhajan Singh, Action King Arjun Friendship Trailer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ