Advertisementt

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అక్టోబర్ 8న

Tue 07th Sep 2021 12:56 PM
most eligible bachelor,most eligible bachelor movie,most eligible bachelor telugu movie,most eligible bachelor akhil akkineni,akhil akkineni,pooja hegde,amani,murali sharma,jaya prakash,pragati,sudigali sudhir,getup srinu,abhay,ga2  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అక్టోబర్ 8న
Most Eligible Bachelor release date మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అక్టోబర్ 8న
Advertisement
Ads by CJ

అక్టోబర్ 8న అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.. ఆకట్టుకుంటున్న రిలీజ్ పోస్టర్..

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌‌గా నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రం నుంచి కొత్త పోస్టర్ విడుదల అయింది. అఖిల్ లోని 7 వర్షన్స్ చూపిస్తూ విడుదలైన ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో 7 విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తున్నారు అఖిల్. ఫార్మల్ లుక్ నుంచి.. మోడ్రన్ అవతారం వరకు అన్ని షేడ్స్ లో అలరించారు అఖిల్. తాజాగా ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్. త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు దర్శకుడు భాస్కర్. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేస్తున్నారు.

న‌టీ న‌టులు: అఖిల్ అక్కినేని, పూజా హెగ్ఢే, ఆమ‌ని, ముర‌ళి శ‌ర్మ‌, జ‌య ప్ర‌కాశ్, ప్ర‌గ‌తి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభ‌య్, అమిత్ తదితరులు..

సాంకేతిక నిపుణులు: దర్శకుడు: బొమ్మ‌రిల్లు భాస్క‌ర్, నిర్మాత‌లు: బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌, బ్యానర్: జీఏ2 పిక్చ‌ర్స్, స‌మ‌ర్ప‌ణ: అల్లు అర‌‌వింద్, మ్యూజిక్: గోపీ సుంద‌ర్, సినిమాటోగ్రాఫీ: ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ, ఎడిట‌ర్: మార్తండ్ కే వెంక‌టేశ్, ఆర్ట్ డైరెక్ట‌ర్: అవినాష్ కొల్లా, పీఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్.

Most Eligible Bachelor release date:

Most Eligible Bachelor release date oct 10th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ