Advertisementt

ఊరికి ఉత్తరాన ఒక రైతు తన కొడుకు కోసం ప్రొడ్యూసర్ గా మారి..

Mon 06th Sep 2021 06:43 PM
ooriki utharana,ooriki utharana movie,ooriki utharana movie stulls,ooriki utharana movie teaser launch  ఊరికి ఉత్తరాన ఒక రైతు తన కొడుకు కోసం ప్రొడ్యూసర్ గా మారి..
Ooriki Utharana Movie Press meet ఊరికి ఉత్తరాన ఒక రైతు తన కొడుకు కోసం ప్రొడ్యూసర్ గా మారి..
Advertisement
Ads by CJ

ఒక రైతు తన కొడుకు కోసం ప్రొడ్యూసర్ గా మారి తీసిన సినిమానే ఊరికి ఉత్తరాన.

ప్రొడ్యూసర్ వనపర్తి వెంకటరత్నం మాట్లాడుతూ.. చాలా సంతోషం గా అనిపించింది, ఊరికి ఉత్తరాన  చాలా ముందుకు పోవాలి అని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ సతీష్ మాట్లాడుతూ.. వేదికను అలంకరించిన పెద్దలు అందరికి నా ధన్యవాదములు. నన్ను నమ్మి నా కథను నమ్మి ప్రొడ్యూస్ చేసిన వనపర్తి వెంకటరత్నం గారికి, మా హీరో నరేన్ గారికి, మా రైటర్స్ ఉదయ్, మని లకు నా కృతజ్ఞతలు.

డి. ఓ. పి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఈ సినిమా తో నాకు చాలా లాంగ్ జర్నీ వుంది, చాలా అనుబంధం వుంది, ఇంతకు మించి మాట్లాడాను, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా థాంక్స్.

రైటర్ ఉదయ్ మాట్లాడుతూ.. సినిమా అందరికి నచ్చుతుంది మీరు అందరు మమ్మల్ని అశ్వరిదించాలి అని కోరుకుంటున్నాను.

మరో రైటర్ మని మాట్లాడుతూ.. అందరికి నమస్కారం, అందరం కలిసి టీమ్ వర్క్ చేసిన సినిమా, నరేన్ అన్నకి సినిమా అంటే చాలా ఇష్టం అందరికి మా సినిమా నచ్చుతుంది అని చెప్పారు.

లిరిక్ రైటర్ పూర్ణ చారి మాట్లాడుతూ..  ఇక్కడకి వచ్చిన పెద్దలందరికి నా ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాను. ఒక మంచి సినిమా కి పనిచేసాను, ఈ సినిమా లో నాలుగు పాటలు రాయటం జరిగింది,మీ అందరికి నచ్చుతాయి అని చెప్పారు.

మరో లిరిక్ రైటర్ సురేష్ గారు మాట్లాడుతూ.. దేవరి సాంగ్  ఒకటి మరొక సాంగ్ రాసాను,మిగత సాంగ్స్ పూర్ణ చారి రాసారు మా నరేన్ కి  మంచి సినిమా గా నిలిచిపోవాలి అని కోరుకున్నాను,డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారి కి నా థాంక్స్ చెప్పుకుంటున్నాను.

యాక్టర్ అంకిత్  మాట్లాడుతూ.. ఎందరో మహానుబావులు  అందులో సినిమా సినిమా పిచ్చోళ్ళు అందులో మా నరేన్ ఒకడు,ఫస్ట్ టైమ్ సినిమా తీయటానికి వచ్చిన రైతు బిడ్డ మా నరేన్, తనకి సినిమా అంటే చాలా చాలా ఇష్టం, మా ప్రొడ్యూసర్ ఒక రైతు అయినా వనపర్తి వెంకటరత్నం గారికి, మా డైరెక్టర్  సతీష్ కి నా స్పెషల్ థాంక్స్.

సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ.. ఇక్కడకి వచ్చిన పెద్దలందరికి  నా నమస్కారాలు, సతీష్ గారు బాగా డైరెక్టర్ చేసారు, మా హీరో నరేన్ కి, అలాగే మా ప్రొడ్యూసర్ వనపర్తి వెంకటరత్నం గారికి ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలి అని కోరుకుంటున్నాను.

లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ గారు మాట్లాడుతూ.. ఈ సినిమా కిపనిచేసిన వారు అంత మా టీమ్అని చెప్పాలి,నేను సీనియర్ లిరిక్ రైటర్ అనుకున్నారో ఏమో తెలియదు కానీ నాకు ఈసినిమాలో పాటలు రాసే అవకాశం ఇవ్వలేదు, భీమ్స్ సాంగ్స్ కి చాలా మంచి సంగీతం అందించారు,అలాగే డైరెక్టర్ సతీష్ సినిమా బాగా తీసాడు, మా నరేన్ కి తన తండ్రి గారు అయినా ప్రొడ్యూసర్ వనపర్తి వెంకటరత్నం గారికి నా ధన్యవాదములు, ఈ సినిమా ని మీరు తప్పకుండ ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను.

సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ.. నరేన్ మట్టిమనిషి అని చెప్పాలి, ఆస్ట్రేలియా వెళ్లి వచ్చి ఇక్కడ ఈగల్స్  పిజ్జా పెట్టి వచ్చిన డబ్బుతో సినిమా తీసి, ఒక తమిళ సినిమా లాగా రా అండ్ రస్టిక్  సినిమా గా తీశారు,చాలా మంది ఈ సినిమా కి పనిచేసిన వారు మీడియా నుండి వచ్చిన వారే కాబట్టి మీడియా మిత్రులందరూ మా ఊరికి ఉత్తరాన సినిమా కి సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను.

శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ.. ఇక్కడకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా  ధన్యవాదములు, ఇకపోతే సినిమా కి పని చేసిన ఉదయ్ మరియు మని నాకు పన్నెండు సంవత్సరాలనుండి  నాకు తెలుసు, నేను చేసిన 90ml అలాగే  హౌస్ అరెస్ట్సినిమాలకి వర్క్ చేసారు, హీరో నరేన్ నన్ను ఆప్యాయం గా నన్ను  అన్నా అని పిలుస్తాడు, మా నరేష్ కి డైరెక్టర్ సతీష్ కి  ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలి,ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారిది లక్కీ హ్యాండ్ అందువల్ల సినిమా మంచి విజయం సాధిస్తుంది అని అన్నారు.

ప్రొడ్యూసర్ అప్పిరెడ్డి గారు మాట్లాడుతూ.. ఇక్కడకి వచ్చిన పెద్దలందరికి ధన్యవాదములు,నాకు  నరేన్ సినిమా చూపించాడు చాలా బాగా వచ్చింది సినిమా ప్రొడ్యూసర్ అయిన  వాళ్ళ ఫాదర్ కి ధన్యవాదములు, సతీష్ గారి అండ్ టీమ్ కి అల్ ది బెస్ట్ అని చెప్పారు.

ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారు మాట్లాడుతూ.. సినిమా మేకింగ్ వీడియో రిలీజ్ చేయటానికి నన్ను పిలిచినందుకు ఈ సినిమా టీమ్ కి నా కృతజ్ఞతలు,సినిమా ని  సపోర్ట్ చేయటానికి వచ్చిన మీకు థాంక్స్, మీడియా మిత్రులు అందరు  ఈ సినిమా కి కూడా సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను, sr కళ్యాణ మండపం,నేను ప్రొడ్యూస్ చేసిన పాగల్, మాతో పాటు రిలీజ్ అన్ని సినిమాలకి కలిపి 59కోట్ల  గ్రాస్ ప్రేక్షకులు ఇచ్చారు, ఎక్సిభిటర్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ అందరికి నాపాదాభివందనం, అందరికంటే సినిమా గొప్పది, సినిమా కంటే ప్రేక్షకులు గొప్పవాళ్ళు. మీ అందరి బబ్లెస్సింగ్స్ మా పై ఇలానే ఉండాలి, ఊరికి ఉత్తరాన సినిమా హీరో నరేన్  నాలాగే సినిమా మీద ప్యాషన్తో వచ్చిన వ్యక్తి నరేన్, నరేన్  ఆస్ట్రేలియా లో బిజినెస్ చేసిన ఇక్కడకి వచ్చి సినిమా తీసాడు, డైరెక్టర్ సతీష్ బాగా కష్ట పడే వ్యక్తి, కొత్త లవ్ స్టోరీ ఇష్టపడే అందరికి ఈ సినిమా నచ్చుతుంది, నరేన్ కి అల్ ది బెస్ట్, ఈ సినిమా కి పని చేసిన ప్రతి ఒక్కరికి అల్ ది బెస్ట్ చెపుతున్నాను. డైరెక్టర్ ఉదయ్ మాట్లాడు అందరికి థాంక్స్, ఇక్కడ నాకు అందరు తెలిసినవాళ్ళు వున్నారు, మేజర్ పార్ట్ ఏమిటి అంటే నరేన్ కి ప్రొడ్యూసర్ అయిన వెంకటరత్నం గారికి కి సినిమా హిట్ అయ్యి డబ్బులు రావాలి అని కోరుకుంటున్నాను.

యాక్టర్ చక్రపాణి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం, ఇండస్ట్రీ లో ఒక గాడ్ ఫాదర్ లేకుండా తాను సంపాదించిన  డబ్బు అంత ఈ సినిమా కి పెట్టటం లో నరేన్ ది దుస్సాహసం అని చెప్పాలి, నా మల్లేశం  సినిమా చూసి నరేన్ ఫోన్ చేసి ఈ సినిమా లో ఫాదర్ క్యారెక్టర్ చేయాలి అన్నారు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి సినిమా తీయటం చూసాం కాని ఒక రైతు తన కొడుకుని హీరో చేస్తూ ప్రొడ్యూస్ చేసిన సినిమా మా ఊరికి ఉత్తరాన సినిమా అని చెప్పారు.

హీరోయిన్ దీపాలి శర్మ మాట్లాడుతూ.. నాకు చాలా స్పెషల్ మూవీ ఇది, నాకు తెలుగు పెద్దగా రాదు, మా  హీరో నరేన్ కి  డైరెక్టర్ సతీష్ ,మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ , నా కోఆర్టిస్ట్స్ అందరికి నా థాంక్స్ అని మాట్లాడారు.

హీరో నరేన్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం, ఫస్ట్ టైమ్ నిలబడుతున్న స్టేజ్ మీద,ఇక్కడకి వచ్చిన పెద్దలకి, మీడియా మిత్రులకి నా థాంక్స్ చెప్పుకుంటున్నాను. బెక్కం  వేణుగోపాల్ గారి తో నాకు పర్సనల్ జర్నీ వుంది ఎప్పటినుంచో, అలాగే డైరెక్టర్ త్రినాధరావు గారు లవ్ యు సార్ ఇక్కడకి నేను అడగ గానే వచ్చినందుకు, సినిమా చూసినా నా శ్రేయోభిలాషులు అందరు చూడగానే ఫస్ట్ టైమ్స్ బాగా చేశాను అన్నారు, అయిదు సంవత్సరాలనుండి  నుంచి శ్యామ్ అన్న నేను మంచి స్నేహితులం థాంక్స్ శ్యామ్ అన్నా ఇక్కడకి వచ్చినందుకు, సురేష్, పూర్ణ మంచి పాటలు రాసారు, డైరెక్టర్ బాగా తీశారు సినిమా ని, ఉదయ్, మని, డైరెక్టర్, నేను ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాం, రీల్ ఫాదర్ అయిన చక్ర పాణి గారు నన్ను చాలా బాగా గైడ్ చేశారు, ఏదైనా నేను బాగా చేయకపోతే ఆయనే చేసి చూపించాడు, మా హీరోయిన్ దీపాలి శర్మ  ప్రతి ఎమోషన్స్ ను గ్రాబ్  చేసుకొని చేసింది, అంకిత్  సెకండ్ హాఫ్ అంత రచ్చ చేసాడు థాంక్యూ అంకిత్, మా నాన్న మై హీరో ఎక్కడో వరంగల్ దగ్గర చిన్న గ్రామం లో వ్యసాయం చేస్తూ  సినిమా అంటే తెలియదు,ఆస్ట్రేలియా అంటే తెలియదు, అలాంటి వ్యక్తి  ఎక్కడ పడితే అక్కడ అప్పులు తీసుకొచ్చి, నన్ను ఈ స్థాయి కి తీసుకువచ్చారు, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తరువాత నాకు ఇక్కడ జాబ్ లేకపోయినప్పుడు మా నాన్న తో సినిమా తీద్దాం అన్నాను అప్పుడు ఆస్ట్రేలియా వెళ్లవు ఓకే తరువాత పిజ్జా అన్నావు ఓకే అసలు ఈ సినిమా గురించి మనకి ఏమి తెలియదు అని అన్నారు, అప్పుడు మా నాన్నతో నేను ఒకటే అన్నాను మనం కష్టపడుతున్నాం, మనం కలలు ని సహకారం చేసుకోవటానికి కష్ట పడుతున్నాం అని అన్నాను, నా జీవితాంతం మా నాన్నకి తోడుగా వుంటా లవ్ యూ నాన్న అని అన్నారు, మీడియా మిత్రులు అందరు మా సినిమా కి సపోర్ట్ చేయాలి అని అన్నారు.

డైరెక్టర్ త్రినాధరావు గారు మాట్లాడుతూ.. గారు నేను మ్యూజిక్ సిట్టింగ్స్ లో వున్నాను గ్యాప్లో టీ తాగుతున్నాను నరేన్ వచ్చి సినిమా తీసాను అన్నాను, సెట్ కూడా వేసాను అన్నాడు  తాజ్ మహల్ వేసావా, చార్మినార్ వేసావా అన్నాను నవ్వుతూ, మీరు టీజర్ రిలీజ్ కి  రావాలి అన్నారు ఒక సాంగ్ చూపించు నచ్చితే వస్తాను అన్నాను అప్పుడు దేవరి సాంగ్ చూపించాడు, చూడగానే వస్తాను అని చెప్పాను, ఈ స్టేజ్ మీద నుండి అడుగుతున్నాను ఇప్పటికి అయినా చెప్పండి ఎవరు ఈ దేవరి అని నవ్వుతూ అడిగారు, భీమ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు ఈ సినిమా కి,నాన్నకు ప్రేమతో కాదు కొడుకుకి ప్రేమతో  అని చెప్పాలి, ఆస్ట్రేలియా వెళ్లి వచ్చాక  జాబ్ రాలేదు మళ్ళీ వెళ్ళిపోదాం అనుకున్నాడు, అప్పుడు నేను చెప్పాను తల్లి తండ్రులకి తోడుగా ఉండరా అని చెప్పాను అప్పుడు అలోచించి సినిమా తియ్యాలి అని ఫిక్స్ అయ్యాడు,సెకండ్ టైం కూడా మీ నాన్నని ప్రొడ్యూసర్ గా  చూడాలి అని కోరుకుంటూ, డైరెక్టర్ సతీష్ కి, హీరోయిన్ దీపాలి శర్మ కి కూడా థాంక్స్ అని చెప్పారు.

తారాగణం: నరేన్ వనపర్తి, దీపాలి శర్మ, రామరాజు, ఆనంద చక్రపాణి, అంకిత్  కొయ్య, ఫణి జగదీశ్, రూప లక్ష్మి, లావణ్య రెడ్డి, ప్రేమ్ సాగర్.

సాంకేతికవర్గం: సినిమాటోగ్రఫీ :శ్రీకాంత్ అరుపుల, మ్యూజిక్: భీమ్స్, సాహిత్యం: సురేష్ గంగుల, పూర్ణ చారి, ఎడిటింగ్: శివ శర్వాని, స్టోరీ -స్క్రీన్ ప్లే -డైలాగ్స్: ఉదయ్ మరియు నాగమణి రాజు, కోప్రొడ్యూసర్: హుస్సేన్ నాయక్, లైన్ ప్రొడ్యూసర్స్: నవీన్ చందా, త్రిలోక్ నాధ్ గడ్ల, ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్: మాల్యా కందుకూరి, ప్రొడ్యూసర్: వనపర్తి వెంకట రత్నం, దర్శకత్వం: సతీష్ అండ్ టీమ్.

Ooriki Utharana Movie Press meet:

Ooriki Utharana Movie teaser launch 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ