సాయితేజ్, దేవ్ కట్టా చిత్రం రిపబ్లిక్ నుంచి జోర్ సే.. సాంగ్ విడుదల
సుప్రీమ్ హీరో సాయితేజ్, దేవ్ కట్టా కాంబినేషన్‌లో రూపొందుతోన్న పొలిటికల్ థ్రిల్లర్ రిపబ్లిక్. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న విడుదలవుతుంది. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఈ చిత్రాన్నినిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలుతుది దశకు చేరుకున్నాయి. సోమవారం ఈ సినిమా నుంచి జోర్ సే.. అనే సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
సిగురు సింతల మీద రామసిలకలోయ్
పగలే దిగినాయ్ సూడు చంద్ర వంకలోయ్
సెరుకు పిల్లాడూ చూసే సూపు సురుకులోయ్
కలికి బుగ్గల మీద సిగ్గు మొలకలోయ్
చూడబోదమా.. ఆడబోదమా..
చూడబోదమా.. ఆడబోదమా
ఏ సెయ్యి సెయ్యి కలిసి సేరబోదమా
జోర్‌సే బార్‌సే తెరసాప జార్‌సే.. పడవనింక జోర్ సే..
అంటూ సాగే ఈ పాట పల్లెటూరిలో జరిగే పండగ వాతావరణం.. అక్కడ హీరో, హీరోయిన్ మధ్య హుషారుగా వచ్చే సాంగ్‌లా అనిపిస్తుంది. మణిశర్మ సంగీత సారథ్యం వహించిన రిపబ్లిక్ చిత్రంలో ఈ పాటను సుద్దాల అశోక్ తేజ రాశారు. అనురాగ్ కులకర్ణి, సాకి శ్రీనివాస్, బరిమి శెట్టి పాడారు.
సినిమా ప్రమోషన్స్ .. డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా సినిమాలో కీలక పాత్రల లుక్స్‌ను, వాటికి సంబంధించిన బ్యాక్‌డ్రాప్‌ను విడుదల చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే హీరో సాయితేజ్, హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్, కీలక పాత్రధారులు జగపతిబాబు, రమ్యకృష్ణ పాత్రలకు సంబంధించిన లుక్స్‌తో పాటు గానా ఆఫ్ రిపబ్లిక్.. సాంగ్ విడుదలై ఆకట్టుకోగా.. ఇప్పుడు జోర్ సే సాంగ్ విడుదలైంది. సాయితేజ్ యాక్టింగ్, దేవ్ కట్టా మార్క్ టేకింగ్ డైలాగ్స్‌తో సినిమాపై ఆసక్తి నెలకొంది. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రాఫర్. కె.ఎల్.ప్రవీణ్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.
నటీనటులు: సాయితేజ్, ఐశ్వర్యా రాజేశ్, జగపతిబాబు, రమ్యకృష్ణ, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, బాక్సర్ దిన,
సాంకేతిక వర్గం: నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు, జీస్టూడియోస్, జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్, కథ, మాటలు, దర్శకత్వం: దేవ్ కట్టా, స్క్రీన్‌ప్లే: దేవ కట్ట, కిరణ్ జయ్ కుమార్, సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్, మ్యూజిక్: మణిశర్మ, ఎడిటర్: కె.ఎల్.ప్రవీణ్.