Advertisementt

ఇక బోర్ డమ్ కి గుడ్ బై.. వచ్చేస్తోంది బిగ్ బాస్ సీజన్ ఫైవ్..

Sun 05th Sep 2021 11:00 AM
bigg boss5,bigg boss season 5,bigg boss season 5,telugu bigg boss telugu 5,the biggest reality show,nagarjuna,host nagarjuna,biggbosstelugu5  ఇక బోర్ డమ్ కి గుడ్ బై.. వచ్చేస్తోంది బిగ్ బాస్ సీజన్ ఫైవ్..
Bigg Boss Season 5 is here ఇక బోర్ డమ్ కి గుడ్ బై.. వచ్చేస్తోంది బిగ్ బాస్ సీజన్ ఫైవ్..
Advertisement
Ads by CJ

సెప్టెంబర్ 5న తెలుగు టెలివిజన్ ఎంటర్ టైన్మెంట్ చరిత్రలో ఓ మరపురాని రోజు కాబోతోంది. తెలుగులో నెంబర్ వన్ ఛానల్ స్టార్ మా.. బిగ్ బాస్ 5వ  సీజన్ ని ప్రారంభిస్తున్న ఆ రోజు ప్రత్యేకంగా నిలవబోతోంది. అదే - బిగ్ బాస్ 5వ సీజన్ ప్రారంభం.

ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో.. సెప్టెంబర్ 5 న  సాయంత్రం 6 గంటలకి ఓ పండగలా, ఓ ఉత్సవంలా ప్రారంభం అవుతోంది. ఇక అక్కడినుంచి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకి, శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకి ప్రసారం అవుతుంది.

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు చూడనంత స్థాయిని బిగ్ బాస్ పరిచయం చేసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో లక్షల కుటుంబాల్ని టీవీ ముందు కట్టి పడేసిన ఆ సెన్సషనల్ షో ఎన్నో లైవ్ ఎమోషన్స్ ని చూపించింది. షో లో నిలవడానికి గెలవడానికి ఎవరు ఎలాంటి ఆలోచనలు చేస్తారో కళ్ళకు కట్టింది. రకరకాల మనస్తత్వాలు వున్న హౌస్ మేట్స్ ని  ఎవర్ గ్రీన్ మన్మధుడు, వెండితెర కింగ్ నాగార్జున ఎలా డీల్ చేసారో మనం చూసాం. ఇప్పుడు హౌస్ లోకి ఎవరు వస్తారో, ఎవరు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో.. చూడాలి. మరి ఈ సీజన్ 5 లో సుమారు వంద రోజుల ఈ ప్రయాణానికి సెప్టెంబర్ 5 న తెర లేవబోతోంది.

ఇక అక్కడినుంచి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకి, శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకి షో ప్రసారం అవుతుంది. చెప్పండి బోర్ డమ్ కి గుడ్ బై.. వచ్చేస్తోంది బిగ్ బాస్ సీజన్ ఫైవ్.. అని చెప్పిన టాగ్ లైన్ ని నిజం చేయబోతోంది.

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి:

Content Produced by: Indian Clicks, LLC

Bigg Boss Season 5 is here:

 Bigg Boss Season 5 is here

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ