Advertisementt

అన్ని ఎమోషన్స్ కలుగుతాయి -మేఘా ఆకాష్

Sat 04th Sep 2021 05:38 PM
dear megha,dear megha movie,megha akash,adhith arun,arjun somayajula,dear megha movie thanks meet  అన్ని ఎమోషన్స్ కలుగుతాయి -మేఘా ఆకాష్
Dear Megha Thanks Meet అన్ని ఎమోషన్స్ కలుగుతాయి -మేఘా ఆకాష్
Advertisement
Ads by CJ

ఎమోషనల్ ఎంటర్ టైనర్ డియర్ మేఘ థియేటర్ లలో మిస్ కావొద్దు - మేఘా ఆకాష్

ఎమోషనల్ ఎంటర్ టైనర్ డియర్ మేఘ ను థియేటర్ లలో మిస్ కావొద్దని అంటున్నారు చిత్ర టీమ్ మెంబర్స్. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సక్సెస్ మీట్ ఫిలిం ఛాంబర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో హీరోయిన్లు మేఘా ఆకాష్, ఆదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరోయిన్ మేఘా ఆకాష్ మాట్లాడుతూ.. డియర్ మేఘకు థియేటర్ ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఒక మంచి ఎమోషనల్ మూవీ ప్రేక్షకులకు నచ్చడం సంతోషంగా ఉంది. నా కెరీర్ లో చేసిన కంప్లీట్ పర్మార్మెన్స్ ఉన్న సినిమా ఇది. డియర్ మేఘ చూస్తే మీరు నవ్వుతారు, ఏడుస్తారు, ఉద్వోగానికి లోనవుతారు.. ఇలా అన్ని ఎమోషన్స్ కలుగుతాయి. చూడని వాళ్లు ఉంటే వెంటనే మీ దగ్గర్లోని థియేటర్ లలో డియర్ మేఘ చూసేయండి. అన్నారు.

హీరో ఆదిత్ అరుణ్ మాట్లాడుతూ.. డియర్ మేఘకు సూపర్బ్ రెస్పాన్స్ ఉంది. నిన్న థియేటర్స్ విజిట్ చేశాం. అక్కడ సినిమా చూస్తున్న ప్రేక్షకులను అబ్సర్వ్ చేశాను. వాళ్లంతా మూవీని ఎంజాయ్ చేస్తున్నాను. చివరలో మాత్రం బాధపడటం గమనించాను. కొందరు ఫోన్ లు చేసి సినిమా చివరలో అలా ఎందుకు చేశారు అంటున్నారు. అదేంటి అనేది మీరు థియేటర్ లలో చూడాలి. ప్రేక్షకులు ఎక్కువగానే వస్తున్నారని థియేటర్స్ ఓనర్స్ నుంచి ఫీడ్ బ్యాక్ ఉంది. మేఘ పర్మార్మెన్స్ చాలా బాగుంది. నాకు మదర్ క్యారెక్టర్ చేసిన పవిత్ర లోకేష్ అద్భుతంగా నటించారు. ఆమెతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. త్వరలో వరంగల్, కరీంనగర్ టూర్ ప్లాన్ చేస్తున్నాం. ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరి చూడాలంటే డియర్ మేఘ చూడండి అన్నారు.

హీరో అర్జున్ సోమయాజుల మాట్లాడుతూ.. నాకు తెలుగులో ఫస్ట్ మూవీనే ఇంత మంచి చిత్రాన్ని ఇచ్చిన దర్శకుడు సుశాంత్, నిర్మాత అర్జున్ గారికి థ్యాంక్స్. డియర్ మేఘతో మా జర్నీ ఎంతో స్పెషల్. మేము నటించేప్పుడు ఎలా ఫీలయ్యామో, ఇవాళ ప్రేక్షకులు కూడా అలాగే అనుభూతి చెందుతున్నారు. డియర్ మేఘను సక్సెస్ చేస్తున్న అందరికీ థాంక్స్ అన్నారు.

Dear Megha Thanks Meet:

Dear Megha movie Thanks Meet

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ