Advertisementt

విజ‌య్‌ ఆంటోని విజ‌య రాఘ‌వ‌న్‌ 17న రిలీజ్

Thu 02nd Sep 2021 06:52 PM
vijay antony,vijaya raghavan,vijaya raghavan movie,vijaya raghavan telugu movie,vijay antony vijaya raghavan on september 17th  విజ‌య్‌ ఆంటోని విజ‌య రాఘ‌వ‌న్‌ 17న రిలీజ్
Vijay Antony Vijaya Raghavan Movie on September 17th విజ‌య్‌ ఆంటోని విజ‌య రాఘ‌వ‌న్‌ 17న రిలీజ్
Advertisement
Ads by CJ

సెప్టెంబర్ 17న విజ‌య్‌ ఆంటోని విజ‌య రాఘ‌వ‌న్‌ గ్రాండ్ రిలీజ్

న‌కిలీ, డా.సలీమ్‌, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్‌ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో విజయ్‌ ఆంటోని. ఈయన హీరోగా.. మెట్రో వంటి డిఫరెంట్‌ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్‌ ఆనంద కృష్ణన్‌ తెరకెక్కించిన చిత్రం విజయ రాఘవన్‌.  ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్‌ సమర్పణలో చెందూర్ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై టి.డి.రాజా, డి.ఆర్‌.సంజయ్‌ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.  కోడియిల్ ఒరువ‌న్‌ పేరుతో త‌మిళంలో.. విజ‌య రాఘ‌వ‌న్‌ పేరుతో తెలుగులో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 17న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. 

ఇది వ‌రకే విడుద‌లైన ఈ సినిమా ట్రైలర్, పాటలకు, టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఓ మాస్ ఏరియాలో పిల్ల‌లు ప‌క్క దారులు ప‌ట్ట‌కుండా.. చ‌దువు గొప్ప‌త‌నాన్ని వారికి వివ‌రించి, వారి ఉన్న‌తికి పాటు ప‌డే యువ‌కుడి క‌థే విజ‌య్ రాఘ‌వ‌న్‌. ప్ర‌స్తుత ట్రెండ్‌కు అనుగుణంగా తెర‌కెక్కించాం. డిఫరెంట్ పాత్ర. కచ్చితంగా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా సినిమా ఉంటుంది. డైరెక్ట‌ర్ ఆనంద కృష్ణ‌న్ సినిమాను అద్భుతంగా అన్ని ఎలిమెంట్స్‌ను క‌వ‌ర్ చేస్తూ తెర‌కెక్కించారు.ఎప్పుడో విడుద‌ల కావాల్సిన సినిమా కోవిడ్ కార‌ణంగా వాయిదా ప‌డింది. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డాయి. ఇప్పుడు సినిమాను సెప్టెంబర్ 17న ప్రేకకుల ముందుకు తీసుకొస్తున్నాం అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తుంది అని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. 

న‌టీన‌టులు: విజయ్‌ ఆంటోని, ఆత్మిక, రామచంద్రరాజు, ప్రభాకర్ తదితరులు.

సాంకేతిక వ‌ర్గం: రచన, దర్శకత్వం: ఆనంద కృష్ణన్‌, నిర్మాతలు: టి.డి.రాజా, డి.ఆర్‌. సంజయ్‌ కుమార్‌, సహ నిర్మాతలు: కమల్ బోరా, లలిత ధనంజయన్‌, బి.ప్రదీప్‌, పంకజ్‌ బోరా, ఎస్‌.విక్రమ్‌ కుమార్‌, సినిమాటోగ్రఫీ: ఎన్‌.ఎస్‌.ఉదయ్‌కుమార్‌, మ్యూజిక్‌: నివాస్‌ కె.ప్రసన్న, ఎడిటర్‌: లియో జాన్‌ పాల్‌.

Vijay Antony Vijaya Raghavan Movie on September 17th:

Grand release of Vijay Antony Vijaya Raghavan on September 17

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ