Advertisementt

అనుభ‌వించు రాజా.. ఫ‌స్ట్ లుక్

Sat 28th Aug 2021 05:59 PM
anubhavinchu raja,anubhavinchu raja movie,anubhavinchu raja first look,raj tarun,kashish khan,posani krishna murali,aadukalam naren,ajay,sudharshan,tempar vamsi,producer supriya yarlagadda,director sreenu gavireddy  అనుభ‌వించు రాజా.. ఫ‌స్ట్ లుక్
Anubhavinchu Raja First Look అనుభ‌వించు రాజా.. ఫ‌స్ట్ లుక్
Advertisement
Ads by CJ

రాజ్ త‌రుణ్ హీరోగా శ్రీను గ‌విరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అన్న‌పూర్ణ స్టూడియోస్‌, ఎస్‌వీసీ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం అనుభ‌వించు రాజా.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన కింగ్ నాగార్జున‌.

యంగ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా, శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో అన్న‌పూర్ణ స్టూడియోస్ ప్రై.లి, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి(ఎస్‌వీసీ ఎల్ఎల్‌పి) ప‌తాకాల‌పై  ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్ రూపొందుతోంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి అనుభ‌వించు రాజా అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను కింగ్ నాగార్జున విడుదల చేశారు. అనుభ‌వించు రాజా టైటిల్ సౌండింగే చాలా డిఫ‌రెంట్‌గా అనిపిస్తుంది. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. చాలా సంతోషంగా ఉంటూ ఎంజాయ్ చేసే పాత్ర‌లో రాజ్ త‌రుణ్ క‌నిపించ‌నున్నాడ‌ని అర్థ‌మ‌వుతుంది. అలాగే రాజ్ త‌రుణ్ లుక్, డ్రెస్సింగ్ చూస్తుంటే పందెం రాయుడిలాగా క‌నిపిస్తున్నాడు. చేతికి బంగారు ఉంగ‌రాలు, చేతికి బ్రాస్‌లెట్ వేసుకుని ఉన్నాడు. పోస్ట‌ర్ బ్యాగ్రౌండ్‌ను గ‌మ‌నిస్తే కొంద‌రు వ్య‌క్తులు రాజ్ త‌రుణ్ వెనుక నిల‌బ‌డి ఉన్నారు. క‌రెన్సీ నోట్లు గాల్లో ఎగురుతున్నాయి. పేక ముక్క‌లు, గుడి క‌నిపిస్తున్నాయి. పోస్ట‌ర్‌లో ఉల్లాసంగా ఉంటూ కోడి పందాలు, జూదం ఆడే వ్య‌క్తి క‌నిపిస్తున్న రాజ్‌త‌రుణ్ త‌న కోడితో స‌ర‌దాగా క‌నిపిస్తున్నాడు.

క‌షీష్ ఖాన్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని సుప్రియ యార్ల‌గ‌డ్డ నిర్మిస్తున్నారు. గోపీ సుంద‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి న‌గేశ్ బానెల్ సినిమాటోగ్ర‌ఫీ, ఛోటా కె.ప్ర‌సాద్ ఎడిట‌ర్‌. భాస్క‌ర‌భ‌ట్ల లిరిసిస్ట్‌. చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న అనుభ‌వించు రాజా త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతుంది.  

న‌టీన‌టులు: రాజ్ త‌రుణ్‌, క‌షీష్ ఖాన్‌, పోసాని కృష్ణ ముర‌ళి, ఆడుగ‌ల‌మ్ న‌రేన్‌, అజ‌య్‌, సుద‌ర్శ‌న్‌, టెంప‌ర్ వంశీ, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌, ర‌వి కృష్ణ‌, భూపాల్ రాజు, అరియానా త‌దిత‌రులు.

సాంకేతిక నిపుణులు: ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: శ్రీను గ‌విరెడ్డి, ప్రొడ్యూస‌ర్‌: సుప్రియ యార్ల‌గ‌డ్డ‌, నిర్మాణ సంస్థ‌లు: అన్న‌పూర్ణ స్టూడియోస్‌, శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పి, మ్యూజిక్‌: గోపీసుంద‌ర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఆనంద్ రెడ్డి క‌ర్నాటి, సినిమాటోగ్ర‌ఫీ: న‌గేశ్ బానెల్‌, ఎడిట‌ర్‌: ఛోటా కె.ప్ర‌సాద్‌, పాట‌లు: భాస్క‌ర భ‌ట్ల‌, ఆర్ట్ డైరెక్ట‌ర్‌: సుప్రియ బ‌ట్టెపాటి, రామ్ కుమార్‌, కొరియోగ్ర‌ఫీ: విజ‌య్ బిన్ని, ఫైట్ మాస్ట‌ర్‌: రియ‌ల్ స‌తీశ్‌, కాస్ట్యూమ్స్‌: రంజిత్‌.పి, కో డైరెక్ట‌ర్‌: సంగ‌మిత్ర గ‌డ్డం, పి.ఆర్‌.ఓ: వంశీ శేఖ‌ర్‌.

Anubhavinchu Raja First Look:

King Nagarjuna Launched First Look Of Raj Tarun Anubhavinchu Raja

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ