Advertisementt

రికార్డు టైం 7 డేస్ 6 నైట్స్

Fri 27th Aug 2021 06:55 PM
7 days 6 nights,sumanth ashwin,rajnikant s,samarth gollapudi,director m.s.raju,m.s.raju  రికార్డు టైం 7 డేస్ 6 నైట్స్
7 Days 6 Nights Movie Grand release soon రికార్డు టైం 7 డేస్ 6 నైట్స్
Advertisement
Ads by CJ

రికార్డు టైంలో షూటింగ్ పూర్తిచేసుకున్న ఎం.ఎస్ రాజు 7 డేస్ 6 నైట్స్

మెగా మేకర్ ఎం.ఎస్ రాజు న్యూ ఏజ్ ఫిల్మ్ 7 డేస్ 6 నైట్స్ టీం క్లిష్ట పరిస్థితుల మధ్య రికార్డు సమయంలో షూట్ పూర్తిచేసేసారు. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ 100 మంది టీంతో, 4 కామెరాలతో గోవా, మంగళూరు మరియు ఉడుపి లో చివరి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఎం. ఎస్. రాజు టీం, నిర్మాణంతర కార్యక్రమాలు, డబ్బింగ్ కూడా పూర్తి చేసుకుని అతి త్వరలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ, అనుకున్న దానికంటే త్వరగా అద్భుతంగా చిత్రం పూర్తయింది. క్లిష్ట పరిస్థితుల్లో కూడా పట్టుదల, క్రమ శిక్షణ తో పని చేసిన నా టీం కి చాలా థాంక్స్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన మా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ కి ఈ చిత్రంతో మళ్ళీ పూర్వ వైభవం రానుంది. మా అబ్బాయిని ఈ చిత్రం తో నిర్మాతగా పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆకట్టుకునే సన్నివేశాలు, అద్భుతమైన విజువల్స్ తో హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది మా 7 డేస్ 6 నైట్స్ కథ అని అన్నారు.

హీరో/నిర్మాత సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ, క్లిష్ట పరిస్థితుల మధ్య కూడా రికార్డు సమయంలో షూటింగ్ పూర్తి చేసుకుంది మా 7 డేస్ 6 నైట్స్ టీం. నా కేరీర్ లోనే ఇది బెస్ట్ చిత్రంగా నిలిచిపోతుంది. మా నాన్నగారికి ఫిల్మ్ మేకింగ్ మీదున్న ప్యాషన్ నాకు చాలా స్పూర్తినిస్తుంది. నిర్మాణం అయినా దర్శకత్వం అయినా ఎంతో పట్టుదలతో అంతే ఇష్టంతో నిర్వర్తిస్తారు. మా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ లో వచ్చిన ఎన్నో క్లాసిక్ హిట్స్ మధ్య ఈ చిత్రం కూడా చేరనుంది. ఈ చిత్ర నిర్మాణంలో భాగంగా వింటేజ్ పిక్చర్స్ మరియు ఏ.బి.జి క్రియేషన్స్ వారితో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది.

అదే సమయంలో కో-ప్రొడ్యూసర్ జె. శ్రీనివాస రాజు మాట్లాడుతూ, ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన మా ఎం.ఎస్ రాజు గారు దర్శకుడిగా డర్టీ హరి తో బ్లాక్ బాస్టర్ అందుకున్న విషయం మనకు తెలుసు. ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో మరో సరికొత్త రొమాంటిక్ ఎంటర్టైనర్ 7 డేస్ 6 నైట్స్ అందించబోతున్నారు. రికార్డు టైం లో షూటింగ్ పూర్తి చేసుకుని డబ్బింగ్ పనుల్లో నిమగ్నమయున్నాం, అతి త్వరలో ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం అన్నారు.

మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై సుమంత్ ఎం. అశ్విన్, ఎస్. రజనీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు ఈ చిత్రనిర్మాణంలో భాగస్వాములు.

సంగీతం: సమర్థ్ గొల్లపూడి, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి, కూర్పు: జునైద్ సిద్ధిఖీ, ప్రొడక్షన్ డిజైనర్: భాస్కర్ ముదావత్, స్టిల్స్: ఎం. రిషితా దేవి, పీఆర్వో: పులగం చిన్నారాయణ, డిజిటల్ ప్రమోషన్స్: సుధీర్ తేలప్రోలు, పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్ అందే, ఎగ్జిక్యూటివ్ నిర్మాత, కో-డైరెక్టర్: యువి సుష్మ, కో ప్రొడ్యూసర్స్: జె. శ్రీనివాసరాజు, మంతెన రాము, నిర్మాతలు: సుమంత్ అశ్విన్, రజనీకాంత్ .ఎస్, రచన, దర్శకత్వం: ఎంఎస్ రాజు.

7 Days 6 Nights Movie Grand release soon:

M.S. Raju wrapped up 7 Days 6 Nights shoot in record time

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ