Advertisementt

రిప‌బ్లిక్‌ లో ఐశ్వ‌ర్యా రాజేశ్ ఇన్‌టెన్స్ రోల్‌

Thu 26th Aug 2021 06:48 PM
aishwarya rajesh,republic movie,sai tej,aishwarya rajesh look from republic impresses  రిప‌బ్లిక్‌ లో ఐశ్వ‌ర్యా రాజేశ్ ఇన్‌టెన్స్ రోల్‌
Aishwarya Rajesh look from Republic revealed రిప‌బ్లిక్‌ లో ఐశ్వ‌ర్యా రాజేశ్ ఇన్‌టెన్స్ రోల్‌
Advertisement
Ads by CJ

సుప్రీమ్‌ హీరో సాయితేజ్‌, దేవ్ క‌ట్టా కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ రిప‌బ్లిక్‌. జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఈ చిత్రాన్నినిర్మాత‌లు జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలుతుది దశకు చేరుకున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. 

సినిమా ప్రమోషన్స్ .. డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా సినిమాలో కీల‌క పాత్ర‌ల లుక్స్‌ను, వాటికి సంబంధించిన బ్యాక్‌డ్రాప్‌ను విడుద‌ల చేస్తూ వ‌స్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు హీరో సాయితేజ్‌, కీల‌క పాత్ర చేస్తున్న జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ లుక్ పోస్ట‌ర్స్‌ను విడుద‌ల చేసిన చిత్ర యూనిట్ లేటెస్ట్‌గా హీరోయిన్ ఐశ్వ‌ర్యా రాజేశ్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.  ఈ పోస్ట‌ర్‌ను సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ విడుద‌ల చేశారు. కూలిపోతాం.. కుంగిపోతాం, ఓడిపోతాం! అయినా... నిల‌బ‌డ‌తాం, కోలుకుంటాం, గెలుస్తాం! అని పోస్ట‌ర్‌పై ఉన్న లైన్స్ సినిమాలో మైరా హ‌న్‌స‌న్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఐశ్వ‌ర్యా రాజేశ్ పాత్ర‌లోని ఇన్‌టెన్సిటీని తెలియ‌జేస్తున్నాయి. 

ఐశ్వ‌ర్యా రాజేశ్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో విలక్ష‌ణ న‌టులు జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల చేసిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌, కాలేజ్ సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సాయితేజ్ యాక్టింగ్‌, దేవ్ క‌ట్టా మార్క్ టేకింగ్ డైలాగ్స్‌తో సినిమాపై ఆసక్తి నెలకొంది. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌. కె.ఎల్‌.ప్ర‌వీణ్ ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. 

Aishwarya Rajesh look from Republic revealed:

Aishwarya Rajesh look from Republic impresses

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ