Advertisementt

విరాట్ రాజ్ చిత్రం సీతామనోహర శ్రీరాఘవ

Wed 25th Aug 2021 10:52 AM
sita manohara sree raghava,sita manohara sree raghava movie,introducing virat raj,sita manohara sree raghava stills,sita manohara sree raghava,virat raj,director durga srivatsasa k,  విరాట్ రాజ్ చిత్రం సీతామనోహర శ్రీరాఘవ
Introducing Virat Raj in Sita Manohara Sree Raghava విరాట్ రాజ్ చిత్రం సీతామనోహర శ్రీరాఘవ
Advertisement
Ads by CJ

విరాట్ రాజ్ హీరోగా సీతామనోహర శ్రీరాఘవ చిత్రం.

అలనాటి అందాల హీరో హరనాథ్ సోదరుడు వెంకట సుబ్బరాజు మనుమడు ఈ విరాట్ రాజ్, ప్రచార చిత్రాలను, వీడియోను విడుదల చేసిన నట శిక్షకుడు శ్రీ సత్యానంద్ గారు.

వెండితెర కు మరో నట వారసుడు పరిచయం అవుతున్నారు. అతని పేరు విరాట్ రాజ్. అలనాటి అందాల హీరో హరనాథ్ సోదరుడు వెంకట సుబ్బరాజు మనుమడు ఈ విరాట్ రాజ్ ఈరోజు అతని పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రం హీరోను, పేరును పరిచయం చేస్తూ రూపొందించిన ప్రచార చిత్రాలను,వీడియోను అతని నట శిక్షకుడు శ్రీ సత్యానంద్ గారు విడుదల చేసి ఆశీస్సులు అందించారు. 

చిత్రం పేరు సీతామనోహర శ్రీరాఘవ. విరాట్ రాజ్ పరిచయ ప్రచార చిత్రాలను  పరిశీలిస్తే పెద తాత హరనాథ్ స్ఫురణకు వస్తారు. ఓ చిత్రంలో అందంగా, క్యూట్ గా కనిపిస్తున్న విరాట్ రాజ్  మరో ప్రచార చిత్రం లో గన్ చేతబట్టి యాక్షన్ లోక్  వెంకట సుబ్బరాజు గారు భక్త తుకారాం, కోడె నాగు, రిక్షా రాజి వంటి అలనాటి పలు చిత్రాలలో కీలక పాత్రలలో నటించారు. ఇటు తాత వెంకట సుబ్బరాజు, అటు పెద తాత హరనాథ్ గారు స్ఫూర్తి తో ఈ సీతామనోహర శ్రీరాఘవ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఇది సరైన చిత్రంగా భావిస్తున్నాను. మీడియా, చిత్ర పరిశ్రమలోని పెద్దలు, ప్రేక్షకులు ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను అన్నారు విరాట్ రాజ్.

ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్న దుర్గా శ్రీ వత్సస.కె. మాట్లాడుతూ.. హీరోగా విరాట్ రాజ్ పరిచయం అవుతున్న ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా నేనూ పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఒక ఇమేజ్ కు మాత్రమే పరిమితం కాకుండా ఈ చిత్రం ద్వారా భిన్నమైన చిత్రాలకు సరితూగే ఇమేజ్ ను విరాట్ రాజ్ స్వంతం చేసుకునేలా ఈ చిత్రం కథను సిద్ధం చేయటం జరిగింది. చిత్రం పేరు సీతామనోహర శ్రీరాఘవ పేరు వెనుక కథ ఏమిటన్నది ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతున్నాము. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా, మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పలు భావోద్వేగాల సమ్మిళితం అన్నారు దర్శకుడు. కె.జి.ఎఫ్. 2, సలార్  చిత్రాలకు సంగీతం సమకూరుస్తున్న రవి బస్ రుర్ ఈ  చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. వెండితెరకు మరో నట వారసుడు ను తమ వందన మూవీస్ చిత్ర నిర్మాణ సంస్థ ద్వారా పరిచయం చేయటం చాలా ఆనందం గా ఉంది అన్నారు చిత్ర నిర్మాత సుధాకర్.టి. సెప్టెంబర్ లో షూటింగ్ ప్రారంభం అవుతుందని, చిత్రంలో ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు ఎవరన్నది మరోసారి ప్రకటించటం జరుగుతుందని అన్నారు. 

ఈ చిత్రానికి సంగీతం: రవి బస్ రుర్ ; పాటలు: రామజోగయ్య శాస్ర్తి; కెమెరా: కల్యాణ్. బి; ఎడిటర్: జి.యం.శాస్త్రి; యాక్షన్: వెంకట్;

నిర్మాత: సుధాకర్.టి; కథ-స్క్రీన్ ప్లే-మాటలు- దర్శకత్వం: దుర్గా శ్రీ వత్సస.కె. బ్యానర్: వందన మూవీస్.

Introducing Virat Raj in Sita Manohara Sree Raghava:

Sita Manohara Sree Raghava telugu Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ