Advertisementt

త‌రం త‌రం స్థిరం చిరంజీవ‌.. సాంగ్‌.

Mon 23rd Aug 2021 07:33 PM
taram taram sthiram song,chiranjeevi birthday,director ramesh,director gopi,taram taram sthiram chirnjeevi song,taram taram sthiram song launch,hero srikanth,taram taram sthiram  త‌రం త‌రం స్థిరం చిరంజీవ‌.. సాంగ్‌.
On the occasion of Chiranjeevi Birthday త‌రం త‌రం స్థిరం చిరంజీవ‌.. సాంగ్‌.
Advertisement
Ads by CJ
త‌మ అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా త‌రం త‌రం స్థిరం చిరంజీవ‌.. సాంగ్‌ను మేజిక్ యాక్సిస్‌, నౌదియాల్ మూవీ మేక‌ర్స్‌తో క‌లిసి రూపొందించిన డైరెక్ట‌ర్స్ ర‌మేశ్ గోపి. 
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు ఆదివారం(ఆగ‌స్ట్ 22). ఈ సంద‌ర్భంగా తెలుగు సినీ ప్రేక్ష‌కాభిమానులు మెగాస్టార్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తున్నారు. కొంద‌రు సోష‌ల్ మీడియా ద్వారా చిరంజీవికి బ‌ర్త్ డే విషెష్ చెబుతుంటే.. మ‌రికొంద‌రు ప్ర‌త్యేక‌మైన‌ వీడియోల ద్వారా అభినంద‌న‌లను తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలో ద‌ర్శ‌క ద్వ‌యం ర‌మేశ్ గోపి తమ అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి కోసం ప్ర‌త్యేక‌మైన ఓ వీడియో సాంగ్‌ను ట్రిబ్యూట్‌గా రూపొందించి.. త‌మ అభిమానాన్ని చాటుకున్నారు..
ఆకాశం వంగింది నీకై.. భూలోకం పొంగింది నీకై
అభిమాన సంద్రం నీకుంది అండ‌
ఇర‌వైలో అమ్మాయిల‌కైనా.. అర‌వైలో అమ్మ‌మ్మ‌ల‌కైనా
గుండెల్లో అనురాగం నింపే జెండా
న‌ట‌న నీ నిచ్చెన‌.. నీ సాటి నువ్వే గురు
నేల‌కే వ‌చ్చిన న‌ట‌రాజు నువ్వే చిరు
త‌రం త‌రం స్థిరం చిరంజీవ‌.. న‌రం న‌రం స్వ‌రం చిరంజీవ.. 
అంటూ సాగే ఈ పాట‌లో వివిధ సంద‌ర్భాల్లో అభిమానులు ఆయ‌న‌పై చాటుకున్న వీడియోల‌ను చూపించారు. ఒక‌వైపు చిరంజీవి న‌ట‌న‌ను, ఆయ‌న చేసిన సేవా కార్య‌క్ర‌మాల‌ను గురించి ప్ర‌స్తావించారు.
మేజిక్ యాక్సిస్‌, నౌదియాల్ మూవీ మేక‌ర్స్ ప‌తాకాల‌పై రోషిణి నౌదియాల్ నిర్మించిన ఈ సాంగ్‌ను చిర్రావూరి విజ‌య్ కుమార్ రాయ‌గా, హేమ‌చంద్ర ఆల‌పించారు. శ్రీవసంత్ ఈ పాట‌కు సంగీతాన్ని అందించారు. ఇది నా ల‌వ్‌స్టోరి క్యూట్ ల‌వ్‌స్టోరితో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన త్వ‌ర‌లోనే రెడ్డిగారింట్లో రౌడీయిజం వంటి ల‌వ్ అండ్ యాక్ష‌న్ చిత్రంతో ఆక‌ట్టుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న డైరెక్ట‌ర్స్ ర‌మేశ్ గోపి.. ఈ పాట‌ను మెగా ఫ్యాన్స్‌తో పాటు అంద‌రికీ న‌చ్చేలా, అంద‌రూ మెచ్చేలా రూపొందించారు. 

On the occasion of Chiranjeevi Birthday:

On the occasion of Chiranjeevi Birthday Taram Taram Sthiram Song

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ