Advertisementt

సెప్టెంబ‌ర్‌లో హ‌ర్భ‌జ‌న్‌ సింగ్‌, అర్జున్ ఫ్రెండ్ షిప్‌

Mon 23rd Aug 2021 07:17 PM
friendship,friendship movie,harbhajan singh,action king arjun,friendship telugu movie,friendship movie in september  సెప్టెంబ‌ర్‌లో హ‌ర్భ‌జ‌న్‌ సింగ్‌, అర్జున్ ఫ్రెండ్ షిప్‌
Harbhajan Singh, Action King Arjun Friendship in September సెప్టెంబ‌ర్‌లో హ‌ర్భ‌జ‌న్‌ సింగ్‌, అర్జున్ ఫ్రెండ్ షిప్‌
Advertisement
Ads by CJ

సెప్టెంబ‌ర్‌లో హ‌ర్భ‌జ‌న్‌ సింగ్‌, యాక్ష‌న్ కింగ్ అర్జున్ ఫ్రెండ్ షిప్‌

ఇండియ‌న్ మాజీ క్రికెట‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్‌, యాక్ష‌న్ కింగ్ అర్జున్ హీరోలుగా న‌టించిన చిత్రం ఫ్రెండ్ షిప్‌. జాన్ పాల్ రాజ్‌, శామ్‌ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏకకాలంలో భారీ ఎత్తున సినిమాను విడుదల చేయ‌డానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్నితెలుగులో శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత ఎ.ఎన్ బాలాజీ విడుద‌ల చేస్తున్నారు. 

ఈ సంద‌ర్భంగా..  శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత, నిర్మాత ఎ.ఎన్ బాలాజీ మాట్లాడుతూ సెకండ్ వేవ్ త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కులు సినిమాల‌ను ఎంతో గొప్ప‌గా ఆద‌రిస్తున్నారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఒరేయ్ బామ్మ‌ర్ది చిత్రం. రీసెంట్‌గా థియేట‌ర్స్‌లో విడులైన ఈ సినిమాకు ప్రేక్షకులనుంచి మంచి స్పందన వచ్చింది.. అందరూ సూపర్ హిట్ సినిమా అంటున్నారు. ఇప్పుడు ఫ్రెండ్ షిప్‌ సినిమాను సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. దాదాపు పాతిక కోట్ల రూపాయ‌ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా త‌ప్ప‌కుండా వైవిధ్యంగా ఉంటుంది.

మ‌లయాళంలో అంద‌రూ కొత్త న‌టీన‌టుల‌తో చేసి సూప‌ర్ హిట్ అయిన క్వీన్ సినిమా రీమేక్ రైట్స్ తీసుకుని ఫ్రెండ్‌షిప్‌ పేరుతో రీమేక్ చేశారు. హ‌ర్భ‌జ‌న్‌, అర్జున్ పోటాపోటీగా న‌టించారు. ఐదు ఫైట్స్‌, నాలుగు పాట‌లుంటాయి. రాజ‌కీయాల‌కు, కాలేజ్ స్టూడెంట్స్ మ‌ధ్య ఏం జ‌రిగింద‌నే విషయాన్ని ఆస‌క్తిక‌రంగా, క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో ఎంగేజింగ్‌గా ద‌ర్శ‌కుడు జాన్ పాల్ రాజ్‌, శామ్‌ సూర్య‌ తెర‌కెక్కించారు. సినిమా ఐదు భాష‌ల్లో(తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం) విడుద‌ల‌వుతుంది. సెన్సార్‌కు సిద్ధమైంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేసేలా ప్లాన్ చేశాం. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేస్తాం అన్నారు.

Harbhajan Singh, Action King Arjun Friendship in September:

Harbhajan Singh, Action King Arjun Friendship movie in September

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ