సెప్టెంబర్‌లో రిలీజ్‌కు సిద్ధమవుతున్న హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్ ఫ్రెండ్ షిప్: శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత, నిర్మాత ఎ.ఎన్ బాలాజీ
ఎ.ఎన్.బాలాజీ.. సినిమా రంగంపై ఆసక్తితో నిర్మాతగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన వ్యక్తి. ఏదో సినిమాలను చేసేయాలనే ఆతృతతో కాకుండా ఆలోచనతో నిర్మాతగా అడుగులు వేస్తున్నారీయన. సినిమా అంటే ఎంటర్‌టైన్‌మెంటే కాదు.. ఎమోషన్ కూడా అని నమ్మిన ఎ.ఎన్.బాలాజీ ప్రేక్షకులను మెప్పించేలా, తన అభిరుచికి తగ్గట్లు సిద్ధార్థ్, జి.విప్రకాశ్ కుమార్ హీరోలుగా రూపొందిన ఒరేయ్ బామ్మర్ది చిత్రాన్ని శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై తెలుగు ప్రేక్షకులకు అందించారు. కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం తగ్గినప్పటికీ సినిమాలను థియేటర్స్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు ఆలోచిస్తుంటే, ఎ.ఎన్.బాలాజీ ధైర్యంగా ముందడుగు వేసి ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయడం విశేషం. కమర్షియల్ అంశాలతో పాటు, ఎమోషనల్ యాంగిల్‌లో ఒరేయ్ బామ్మర్ది ప్రేక్షకుల మన్ననలను అందుకుంది. అదే ఉత్సాహంతో మరో డిఫరెంట్ మూవీని తెలుగు ప్రేక్షకులకు అందిచడానికి సిద్ధమయ్యారు. ఆ చిత్రమే.. ఫ్రెండ్‌ఫిప్. జాన్ పాల్ రాజ్, శామ్ సూర్య దర్శకులు. ఇండియన్ మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్ హీరోలుగా నటించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేరోజున విడుదలవుతున్న ఫ్రెండ్‌షిప్ చిత్రాన్ని తెలుగులో ఎ.ఎన్.బాలాజీ సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఈ సందర్భంగా..
శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత, నిర్మాత ఎ.ఎన్ బాలాజీ మాట్లాడుతూ.. కరోనా లాంటి విపత్కర పరిస్థితిని దాటుకుని టాలీవుడ్ సినీ పరిశ్రమ లో సినిమాలు వస్తుండడం ఎంతో మంచి పరిణామం. మంచి సినిమాలకు తమ ఆదరణ ఎప్పటికీ ఉంటుందని ప్రపంచానికి ఫస్ట్ వేవ్‌లో ప్రపంచానికి ప్రూవ్ చేసిన మన తెలుగు ప్రేక్షకులు.. ఇప్పుడు సెకండ్ వేవ్ తర్వాత కూడా సినిమాలను అంతే గొప్పగా ఆదరిస్తున్నారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఒరేయ్ బామ్మర్ది చిత్రం. రీసెంట్‌గా థియేటర్స్‌లో విడులైన ఈ సినిమాకు ప్రేక్షకులనుంచి మంచి స్పందన వచ్చింది.. అందరూ సూపర్ హిట్ సినిమా అంటున్నారు. ఇప్పుడు ఫ్రెండ్ షిప్ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. దాదాపు పాతిక కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా తప్పకుండా వైవిధ్యంగా ఉంటుంది.
మలయాళంలో అందరూ కొత్త నటీనటులతో చేసి సూపర్ హిట్ అయిన క్వీన్ సినిమా రీమేక్ రైట్స్ తీసుకుని ఫ్రెండ్‌షిప్ పేరుతో రీమేక్ చేశారు. హర్భజన్, అర్జున్ పోటాపోటీగా నటించారు. ఐదు ఫైట్స్, నాలుగు పాటలుంటాయి. రాజకీయాలకు, కాలేజ్ స్టూడెంట్స్ మధ్య ఏం జరిగిందనే విషయాన్ని ఆసక్తికరంగా, కమర్షియల్ అంశాలతో ఎంగేజింగ్‌గా దర్శకుడు జాన్ పాల్ రాజ్, శామ్ సూర్య తెరకెక్కించారు. సినిమా ఐదు భాషల్లో(తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం) విడుదలవుతుంది. సెన్సార్‌కు సిద్ధమైంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సెప్టెంబర్‌లో విడుదల చేసేలా ప్లాన్ చేశాం. త్వరలోనే రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేస్తాం అన్నారు.