Advertisementt

అమెజాన్ ప్రైమ్‌లో మెరిసే మెరిసే

Sat 21st Aug 2021 05:40 PM
merise merise,merise merise movie,merise merise movie on amazon prime,ott,  అమెజాన్ ప్రైమ్‌లో మెరిసే మెరిసే
Merise merise movie on Amazon Prime అమెజాన్ ప్రైమ్‌లో మెరిసే మెరిసే
Advertisement
Ads by CJ

అమెజాన్ ప్రైమ్‌లో ఆక‌ట్టుకుంటున్న మెరిసే మెరిసే

సెన్సిబుల్, క్యూట్ ల‌వ్‌స్టోరీస్‌కు ప్రేక్ష‌కాద‌ర‌ణ ఎప్ప‌టికీ ఉంటుంద‌ని రీసెంట్‌గా మ‌రోసారి ప్రూవ్ చేసిన చిత్రం మెరిసే మెరిసే. హుషారు ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన ఈ చిత్రాన్ని  కొత్తూరి ఎంటర్ టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.  ల‌వ్ అండ్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఆగ‌స్ట్ 6న థియేట‌ర్స్‌లో విడుద‌లై ప్రేక్ష‌కుల‌ను, విమ‌ర్శ‌కుల‌ను మెప్పించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిట‌ల్ మాధ్య‌మంలో ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. 

ప్ర‌ముఖ డిజిట‌ల్ ఛానెల్ అమెజాన్ ప్రైమ్‌లో మెరిసే మెరిసే సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత వెంక‌టేశ్ కొత్తూరి మాట్లాడుతూ కోవిడ్ సెకండ్ వేవ్ త‌ర్వాత థియేట‌ర్స్‌లో వ‌చ్చిన మా సినిమా మెరిసే మెరిసే చిత్రాన్ని ప్రేక్ష‌కుల‌కు ఆద‌రించారు. సినిమా బావుంటుందంటూ రివ్యూయ‌ర్స్ కూడా అప్రిషియేట్ చేశారు. స్త్రీ సాధికార‌త అనే అంశాన్ని ప్రేమ క‌థ‌కు ముడిపెట్టి వివ‌రించిన తీరు ఆడియెన్స్‌కు బాగా క‌నెక్ట్ అయ్యింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో మెరిసే మెరిసే అందుబాటులోకి వ‌చ్చింది. దినేష్ తేజ్‌, శ్వేతా అవ‌స్థి స‌హా న‌టీన‌టుల పెర్ఫామెన్స్‌, ల‌వ్ అండ్ ఎమోష‌న‌ల్ పాయింట్స్‌.. ఈ జ‌న‌రేష‌న్‌లో కెరీర్ ప‌రంగా యూత్.. ముఖ్యంగా మ‌హిళ‌లు ఎలా ఆలోచిస్తున్నార‌నే పాయింట్‌ను క‌నెక్టింగ్‌గా చెప్పాం. త‌ప్ప‌కుండా సినిమాను చూసి అంద‌రూ ఎంజాయ్ చేయండి అన్నారు.

Merise merise movie on Amazon Prime:

Impressive Merise merise movie on Amazon Prime

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ