Advertisementt

శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్..

Thu 19th Aug 2021 08:00 PM
sridevi soda center,sridevi soda center movie,sridevi soda center movie trailer,sudhir babu,anandi,pavel navgeetham,naresh,raghubabu,ajay,satyam rajesh,harha vardain,saptagiri,kalyani raju,rohini  శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్..
Sridevi Soda Center Trailer శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్..
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదలైన సుధీర్ బాబు శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్..

సుధీర్ బాబు, ఆనంది ప్రధాన పాత్రల్లో పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఆగస్ట్ 27న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, సుధీర్ బాబు ఇంట్రడక్షన్ టీజర్‌కు, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదలైంది. యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్, రొమాన్స్.. ఇలా అన్నీ సమపాళ్లలో శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. ఈ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

శ్రీదేవి నాది.. నాదే..

నా శ్రీదేవికి పెళ్లి చేస్తార్రా..?

అంటూ సుధీర్ బాబు చెప్పే డైలాగులకు మంచి స్పందన వస్తుంది. శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకు అదిరిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇండియా వ్యాప్తంగా శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకు చాలా మంచి బిజినెస్ జరిగింది. ఈ సినిమా థియెట్రికల్ రైట్స్ ఫాన్సీ ప్రైస్ కు అమ్ముడయ్యాయి. సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, బ్రిడ్జ్ ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత లక్ష్మణ్ శ్రీదేవి సోడా సెంటర్ హక్కులను సొంతం చేసుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలవుతున్న శ్రీదేవి సోడా సెంటర్ సినిమాను వీలైనంత వరకు భారీగానే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు లక్ష్మణ్ గారు. ఈయన ఈ మధ్యే విడుదలై బ్లాక్‌బస్టర్ అయిన జాతి రత్నాలు సినిమాను లక్ష్మణ్ గారు డిస్ట్రిబ్యూట్ చేసారు. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.

నటీనటులు: సుధీర్ బాబు, ఆనంది , ప‌వెల్ న‌వ‌గీత‌మ్‌,న‌రేష్‌, ర‌ఘుబాబు, అజ‌య్‌, స‌త్యం రాజేష్, హ‌ర్హ వ‌ర్ద‌న్‌, స‌ప్త‌గిరి, క‌ళ్యణి రాజు, రొహిణి, స్నేహ గుప్త త‌దిత‌రులు.

టెక్నికల్ టీం: ర‌చ‌న‌-దర్శకత్వం: కరుణ కుమార్, నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి, బ్యానర్: 70mm ఎంటర్టైన్మెంట్స్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: శ్యామ్ దత్ సైనుద్దీన్, సంగీతం: మణిశర్మ, ప్రోడ‌క్ష‌న్ డిజైన‌ర్‌ప.. రామ‌కృష్ణ‌- మౌనిక‌, క‌థ‌.. నాగేంద్ర కాషా, కొరియొగ్రాఫ‌ర్స్‌.. ప్రేమ్ ర‌క్షిత్‌, విజ‌య్ బిన్ని, య‌శ్వంత్‌, యాక్ష‌న్‌.. డ్రాగ‌న్ ప్ర‌కాష్‌, కె ఎన్ ఆర్ (నిఖిల్‌) , రియ‌ల్ స‌తీష్, లిరిక్స్‌: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, క‌ళ్యాణ చ‌క్ర‌వ‌ర్తి, కాస‌ర్ల శ్యామ్‌, పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్‌.

Sridevi Soda Center Trailer:

Sridevi Soda Center Movie Trailer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ