Advertisementt

సూరాపానంలో పార్వతి ఫస్ట్‌లుక్‌

Tue 17th Aug 2021 06:15 PM
surapanam movie,hero sampath kumar,parvati firstlook  సూరాపానంలో పార్వతి ఫస్ట్‌లుక్‌
Parvati Firstlook in Surapanam సూరాపానంలో పార్వతి ఫస్ట్‌లుక్‌
Advertisement
Ads by CJ

సంపత్‌కుమార్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం సూరాపానం. కిక్‌ అండ్‌ ఫన్‌ అనేది ఉపశీర్షిక. అఖిల్‌ భవ్య క్రియేషన్స్‌ పతాకంపై మధు యాదవ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాయికగా నటిస్తున్న ప్రగ్యానయన్‌ ఫస్ట్‌లుక్‌ను నేడు ఆమె జన్మదినం సందర్భంగా విడుదల చేసింది చిత్రబృందం. 

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ  ఈ చిత్రంలో పార్వతిగా కథానాయిక ప్రగ్యానయన్‌ ఓ ఆసక్తికరమైన పాత్రలో కనిపించబోతుంది. గ్లామర్‌తో పాటు అభినయానికి ఆస్కారమున్న పాత్రలో అందర్ని అలరించబోతుంది. నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం ప్రేక్షకులకు థ్రిల్‌తో పాటు వినోదాన్ని కూడా అందించబోతుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు. అజయ్‌ ఘోష్‌, సూర్య, జెన్నీ, మీసాల లక్ష్మణ్‌, చమ్మక్‌ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: రాజేంద్రప్రసాద్‌, కెమెరా: విజయ్‌ ఠాగూర్‌, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో.

Parvati Firstlook in Surapanam :

Parvati Firstlook in Surapanam movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ