Advertisementt

మంచి రోజులు వ‌చ్చాయి సిద్ శ్రీరామ్ సాంగ్

Mon 16th Aug 2021 05:48 PM
manchi rojulu vachahayi,manchi rojulu vachchayi movie,santosh sobhan,mehreen pirzada,so so ga song from manchi rojulu vachchayi  మంచి రోజులు వ‌చ్చాయి సిద్ శ్రీరామ్ సాంగ్
Sai Tej releases So So Ga from Manchi Rojulu Vachchayi మంచి రోజులు వ‌చ్చాయి సిద్ శ్రీరామ్ సాంగ్
Advertisement
Ads by CJ

సుప్రీమ్ హీరో సాయితేజ్ చేతుల మీదుగా విడుద‌లైన స్టార్ డైరెక్ట‌ర్ మారుతి, సంతోష్ శోభ‌న్ మంచి రోజులు వ‌చ్చాయి స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ ఫ‌స్ట్ సింగిల్ సాంగ్ 

యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా వరస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు మారుతి రూపొందిస్తున్న కొత్త సినిమా మంచి రోజులు వచ్చాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు క్యారెక్ట‌ర్ ఇంట్రో వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నేప‌థ్యంలో మంచి రోజులు వ‌చ్చాయి మూవీ ఆడియో అల్బ‌మ్ నుంచి సెన్సేష‌నల్ హ్యాపెనింగ్ సింగ‌ర్ సిద్ శ్రీరామ్ ఆల‌పించిన సోసోగా ఉన్న పాట తాజాగా విడుద‌లై అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటూ, ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సిద్ శ్రీరామ్ మ్యాజిక‌ల్ వాయిస్, సంగీత ద‌ర్శ‌కుడు అనూప్ రూబెన్స్ ఇచ్చిన ట్యూన్స్, కేకే లిరిక్స్ వెర‌సి ఈ పాట‌ను నెక్ట్స్ లెవ‌ల్ కి తీసుకెళ్లాయి, అలానే ఈ పాట లిరికల్ వీడియోలో కొంత మేర ఉప‌యోగించిన విజువ‌ల్స్ కూడా చాలా క‌ల‌ర్ ఫుల్ గా ఉన్నాయి, 

ఇక ఈ పాట‌ను కొరియోగ్ర‌ఫి చేసిన య‌శ్ మాస్ట‌ర్ హీరో సంతోష్ శోభన్, హీరోయిన్ మెహ్రీన్ తో అదిరిపోయే డాన్స్ మూమెంట్స్ వేయించారు. ఏక్ మినీ కథ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యువ హీరో సంతోష్ శోభన్ ఈ చిత్రంలో మెయిన్ లీడ్ చేస్తున్నారు. మహానుభావుడు లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మారుతి కాంబినేషన్‌లో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను వి సెల్యులాయిడ్, SKN నిర్మిస్తున్నారు. టాక్సీవాలా తర్వాత ఎస్ కే ఎన్ నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది. మారుతి, యూవీ, SKN అంటే సూపర్ హిట్ కాంబినేషన్. ఈ కాంబోలో ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి సినిమా వస్తుంది. ఏక్ మినీ కథ లాంటి హిట్ సినిమాను నిర్మించిన యూవీ కాన్సెప్ట్స్‌తో మరోసారి జోడీ కట్టాడు సంతోష్ శోభన్. త్వ‌ర‌లోనే ఈ సినిమాను భారీ రేంజ్ లో థియేట్రిక‌ల్ రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లుగా నిర్మాత ఎస్ కే ఎన్ తెలిపారు. మిగిలిన వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు. ఈ సినిమా ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌లవుతుంది.

నటీనటులు: సంతోష్ శోభన్, మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా.

టెక్నికల్ టీం: కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: మారుతి, నిర్మాత: వి సెల్యూలాయిడ్ SKN, బ్యానర్స్: యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్, సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్, సంగీతం: అనూప్ రూబెన్స్, పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్.

Sai Tej releases So So Ga from Manchi Rojulu Vachchayi:

Manchi Rojulu Vachahayi So So Ga song spellbounds

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ