Advertisement

భారీ వర్షాల మధ్య గోవాలో 7 డేస్ 6 నైట్స్

Mon 16th Aug 2021 05:37 PM
7 days 6 nights movie,7 days 6 nights movie schedule in goa,director m.s.raju,sumanth ashwin,  భారీ వర్షాల మధ్య గోవాలో 7 డేస్ 6 నైట్స్
7 Days 6 Nights movie Schedule in Goa భారీ వర్షాల మధ్య గోవాలో 7 డేస్ 6 నైట్స్
Advertisement

భారీ వర్షాల మధ్య 7 డేస్ 6 నైట్స్ ముఖ్యమైన గోవా షెడ్యూల్ పూర్తి చేసిన ఎం.ఎస్ రాజు!

విభిన్నమైన థ్రిల్లర్ డర్టీ హరి తో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన మెగా మేకర్ ఎం.ఎస్ రాజు, 7 డేస్ 6 నైట్స్ లాంటి యూత్ ఎంటర్టైనర్ తో రానున్న విషయం తెలిసిందే. అయితే, ఋతుపవనాల వల్ల భారీ వర్షాలు కురుస్తూ, కరోనా నియమాల కఠినంగా అమలవుతున్న గోవా లో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ 100 మంది టీంతో, 4 కామెరాలతో 7 డేస్ 6 నైట్స్ ముఖ్యమైన సన్నివేశాలని చిత్రీకరించారు డైరెక్టర్ ఎం. ఎస్. రాజు. తరువాతి షెడ్యూల్ కోసం మంగళూరు మరియు ఉడుపికి వెళుతున్న మూవీ టీం, అతి త్వరలో చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనతో ఉన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నిర్మించాక, దర్శకుడిగా నేను తీసిన డర్టీ హరి లాంటి థ్రిల్లింగ్ కథ సక్సెస్ అవ్వడం నాకు చాలా ఎనర్జీనిచ్చింది. అందుకే రెట్టింపు ఉత్సాహంతో మా 7 డేస్ 6 నైట్స్ ని చిత్రీకరిస్తున్నాం. విభిన్నమైన కథనం - సన్నివేశాలతో కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. హీరో సుమంత్ అశ్విన్ తన కేరీర్ లోనే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. హీరోయిన్ మెహెర్ చాహల్ మొదటి చిత్రం అయినా నటన ఆదరగోట్టేసింది. ఇప్పుడున్న ఎంతో మంది పెద్ద నటీనటులని, సాంకేతిక నిపుణులని పరిచయం చేసినట్టే 16 మంది కొత్త టాలెంట్ ని మా చిత్రంతో పరిచయం చేయనున్నాం. మరో జంట రోహన్ క్రితిక, సినిమాటోగ్రాఫర్ నాని చమిడిశెట్టి, 16 ఏళ్ళ మ్యూజిక్ డైరెక్టర్ సమర్థ్ గొల్లపూడి కూడా వారిలో ఉన్నారు. నాకు చాలా నచ్చే టెక్నీషియన్ ఎడిటర్ జునైద్ సిద్ధిఖీ ఈ చిత్రంలో నాకు చాలా పెద్ద బలంగా నిలిచారు అని అన్నారు.

ఒక వైపు చిత్రీకరణ చివరి దశలో ఉండగా మరోవైపు నిర్మాణంతర కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసుకుంటున్నాం. ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రావడంతో త్వరలో ఆసక్తికరమైన రెండో పోస్టర్ కూడా విడుదల చేయనున్నాం అని చిత్ర కో- ప్రొడ్యూసర్ జె. శ్రీనివాసరాజు అన్నారు. మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై ఎం. సుమంత్ అశ్విన్, ఎస్. రజనీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు ఈ చిత్రనిర్మాణంలో భాగస్వాములు.

సంగీతం: సమర్థ్ గొల్లపూడి, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి, కూర్పు: జునైద్ సిద్ధిఖీ, ప్రొడక్షన్ డిజైనర్: భాస్కర్ ముదావత్, స్టిల్స్: ఎం. రిషితా దేవి,పీఆర్వో: పులగం చిన్నారాయణ, డిజిటల్ ప్రమోషన్స్: సుధీర్ తేలప్రోలు, పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్ అందే, ఎగ్జిక్యూటివ్ నిర్మాత, కో-డైరెక్టర్: యువి సుష్మ, కో ప్రొడ్యూసర్స్: జె. శ్రీనివాసరాజు, మంతెన రాము, నిర్మాతలు: సుమంత్ అశ్విన్, రజనీకాంత్ .ఎస్, రచన, దర్శకత్వం: ఎంఎస్ రాజు.

7 Days 6 Nights movie Schedule in Goa :

M.S. Raju 7 Days 6 Nights wraps up Goa schedule amidst torrential rainfall

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement