Advertisementt

శ్రీహ‌రి త‌న‌యుడు మేఘాంశ్ కు రాసిపెట్టుంటే..

Sun 15th Aug 2021 06:43 PM
raasipettunte,raasipettunte movie,meghamsh,srihari son,meghamsh srihari,direction nandu mallela,producer c kalyan,banner ck entertainments,raasipetti unte   శ్రీహ‌రి త‌న‌యుడు మేఘాంశ్ కు రాసిపెట్టుంటే..
Meghamsh film has been titled Raasipettunte Movie శ్రీహ‌రి త‌న‌యుడు మేఘాంశ్ కు రాసిపెట్టుంటే..
Advertisement
Ads by CJ

మేఘాంశ్ శ్రీహ‌రి, నందు మ‌ల్లెల కాంబినేష‌న్‌లో సి.క‌ళ్యాణ్ చిత్రం రాసిపెట్టుంటే..

లెజెండ్రీ న‌టుడు, స్వ‌ర్గీయ శ్రీహ‌రి త‌న‌యుడు మేఘాంశ్ శ్రీహ‌రి క‌థానాయ‌కుడిగా రూపొంద‌నున్న మూడో చిత్రం రాసిపెట్టుంటే.. సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. బ్యాన‌ర్‌పై  ప్ర‌ముఖ సీనియ‌ర్ నిర్మాత సి.క‌ళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ డిఫ‌రెంట్ మూవీని నందు మ‌ల్లెల డైరెక్ట్ చేస్తున్నారు.

ఆదివారం(ఆగ‌స్ట్‌15) రోజున శ్రీహ‌రి జ‌యంతి సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఓ సాయంత్ర స‌మ‌యాన‌.. ఓ ప్రాంతంలో ఫెన్సింగ్ వేసి ఉన్నారు. దానికి అవ‌త‌ల వైపు రోడ్డుపై ఓ బ‌స్సు వెళుతుంది. ఈ అంశాల‌తో డిఫ‌రెంట్‌గా, ఆక‌ట్టుకునేలా పోస్ట‌ర్ ఉంది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొంద‌నున్న ఈ సినిమాలోని ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియజేసింది.

న‌టీన‌టులు: మేఘాంశ్ శ్రీహ‌రి.

సాంకేతిక వ‌ర్గం: ద‌ర్శ‌క‌త్వం: నందు మ‌ల్లెల‌, నిర్మాత‌: సి.క‌ళ్యాణ్‌, బ్యాన‌ర్‌: సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి, పి.ఆర్‌.ఓ: వంశీ శేఖ‌ర్‌. 

Meghamsh film has been titled Raasipettunte Movie:

 Meghamsh film has been titled Raasipettunte Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ