Advertisementt

విశాఖ‌ప‌ట్నంలో రౌడీగాడు.. గ‌ల్లీ రౌడీ.

Sat 14th Aug 2021 04:54 PM
galli rowdy,galli rowdy movie,galli rowdy u / a certified,galli rowdy songs,galli rowdy sndeep,sandeep kishan  విశాఖ‌ప‌ట్నంలో రౌడీగాడు.. గ‌ల్లీ రౌడీ.
Galli Rowdy Song విశాఖ‌ప‌ట్నంలో రౌడీగాడు.. గ‌ల్లీ రౌడీ.
Advertisement
Ads by CJ

గ‌ల్లీ రౌడీ నుంచి లిరిక‌ల్ వీడియో సాంగ్ విశాఖ‌ప‌ట్నంలో రౌడీగాడు.. రిలీజ్‌.

గొడ‌వ‌లంటే భ‌య‌ప‌డే ఓ యువ‌కుడు.. అంద‌మైన అమ్మాయిని చూసి ప్రేమ‌లో ప‌డ్డాడు.. త‌న కోసం రౌడీగా మారాల్సి వ‌స్తుంది. మారుతాడు.. త‌న‌కు భ‌యం లేన‌ట్లు బిల్డ‌ప్‌లిస్తుంటాడు.. మ‌రి ఈ ప్రేమ ప్ర‌యాణంలో అత‌డి పాట్లెలా ఉండ‌బోతున్నాయో తెలుసుకోవాలంటే గ‌ల్లీ రౌడీ సినిమా చూడాల్సిందే అంటున్నారు మేక‌ర్స్‌. ఇందులో హీరో క్యారెక్ట‌ర్‌ను తెలియ‌జేస్తూ వినేవాళ్ల‌కి న‌వ్వు పుట్టేలా విశాఖ‌ప‌ట్నంలో రౌడీగాడు.. అనే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది..

పిల్ల పిల్ల పిల్లకోసం పిల్లగాడు వేసే కొత్త వేషం

ఇంత‌లోనే ఎంత హ‌ట్ట‌హాసం క‌దిలెను క‌దా! వీడి ప్రేమ క‌థ‌

చెయ్య‌లేదు వీడు ఒక్క యుద్దం.. చూడ‌లేడు వీడు కోడి ర‌క్తం

రాడ్డు ప‌ట్టినాడు ప్రేమ కోసం ముదిరెను క‌దా వీడి ప్రేమ క‌థ‌

వీడేమో ప‌డుచోడు, వీడెన‌క ముస‌లోళ్లు.. ఓఎల్ఎక్స్ పీసుల‌తోటి ఏం సాధిస్తాడు

ముందెన‌కా చూడ‌కుండా ఫైటింగ్‌కే దిగినాడు, ఈ కత్తుల కొట్లాట‌ల్లో ఏమైపోతాడు

విశాఖ‌ప‌ట్నంలో రౌడీగాడు.. ష‌ర్ట్ బ‌ట‌నిప్పాడు ఓ మై గాడు

అంటూ సాగే ఈ పాట‌ను హీరో సందీప్ కిష‌న్‌, హీరోయిన్ నేహా శెట్టి ప్రేమ కోసం పాట్లను చూపించేలా తెరకెక్కించారు. 

ఇప్పటి వరకు గల్లీ రౌడీ చిత్రం నుంచి విడుదలైన పుట్టేనె ప్రేమ.. అనే మాంటేజ్ లవ్ సాంగ్, చాంగురే చాంగురే.. అనే ఐటెమ్ సాంగ్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడదే బాటలో విశాఖ‌ప‌ట్నంలో రౌడీగాడు.. సాంగ్ ఆకట్టుకుంటోంది.  అలాగే సినిమా హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్ అని తెలియ‌జేసేలా విడుద‌లైన టీజ‌ర్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉందంటూ ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. మంచి అంచ‌నాలను క్రియేట్ చేసుకున్న గల్లీ రౌడీ సినిమాను ఆగస్ట్‌లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తామ‌ని నిర్మాతలు తెలియజేశారు. 

సందీప్ కిషన్, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్ పొందింది. బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల స‌క్సెస్‌లో కీల‌క పాత్ర‌ను పోషించిన స్టార్ రైట‌ర్  కోన వెంక‌ట‌న్ గల్లీ రౌడీ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హిరించ‌డ‌మే కాకుండా స్క్రీన్‌ప్లేను కూడా అందించారు. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో సీమ‌శాస్త్రి, సీమ‌ట‌పాకాయ్‌, దేనికైనా రెఢీ, ఈడోర‌కం ఆడోర‌కం వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల డైరెక్ట‌ర్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ గల్లీ రౌడీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌ట‌కిరిటీ రాజేంద్ర ప్ర‌సాద్ ఇంపార్టెంట్ రోల్‌ను పోషించిన ఈ చిత్రంలో కోలీవుడ్ యాక్టర్ బాబీ సింహ ఓ కీలక పాత్రలో నటించారు. 

న‌టీన‌టులు: సందీప్ కిష‌న్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, బాబీ సింహ, నేహా శెట్టి, పోసాని కృష్ణ ముర‌ళి, వెన్నెల కిషోర్‌, వైవా హ‌ర్ష‌, త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు: బ్యానర్: కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌, ఎం.వి.వి.సినిమా, స‌మ‌ర్ప‌ణ‌: కోన వెంక‌ట్‌, ద‌ర్శ‌క‌త్వం: జి.నాగేశ్వ‌ర్ రెడ్డి, నిర్మాత‌: ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌, స‌హ నిర్మాత‌: జి.వి, సంగీతం: చౌర‌స్తా రామ్‌, సాయికార్తీక్‌, స్క్రీన్ ప్లే: కోన వెంక‌ట్‌, క‌థ‌: భాను, ఎడిట‌ర్‌: ఛోటా కె.ప్ర‌సాద్‌, స్టైలిష్ట్‌: నీర‌జ కోన‌, పి.ఆర్‌.ఒ: వంశీ కాక‌.

Galli Rowdy Song:

Galli Rowdy U / A certified

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ