Advertisementt

మళ్ళీ మొదలైంది సుమంత్ క్యారెక్ట‌ర్ రివీలింగ్

Sat 14th Aug 2021 04:40 PM
malli modalaindi,malli modalaindi movie,malli modalaindi poster,malli modalaindi sumanth,malli modalaindi  మళ్ళీ మొదలైంది సుమంత్ క్యారెక్ట‌ర్ రివీలింగ్
Malli Modalaindi Poster మళ్ళీ మొదలైంది సుమంత్ క్యారెక్ట‌ర్ రివీలింగ్
Advertisement
Ads by CJ

మళ్ళీ మొదలైంది నుంచి హీరో సుమంత్ క్యారెక్ట‌ర్ రివీలింగ్ పోస్ట‌ర్ విడుదల

హీరో సుమంత్ తాజా చిత్రం మళ్ళీ మొదలైంది. టి.జి.కీర్తి కుమార్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమాలో వెడ్డింగ్ కార్డ్ లీక్ కావ‌డంతో మూవీ ల‌వ‌ర్స్ అందరిలో ఓ అటెన్ష‌న్ క్రియేట్ అయ్యింది. త‌ర్వాత సినిమా ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న సుహాసిని, వెన్నెల కిషోర్ లుక్స్‌ను చిత్ర యూనిట్ ఇటీవ‌ల విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారం హీరో సుమంత్ క్యారెక్ట‌ర్ రివీలింగ్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

పోస్ట‌ర్‌లో హీరో  సుమంత్ లుక్ చాలా క్లాస్‌గా అంద‌రినీ ఆక‌ట్టుకునేలా ఉంది. అయితే పొగ‌డ‌రి అయిన మ‌న హీరో సినిమాలో క‌న్‌ఫ్యూజింగ్‌గా ఉంటాడు. పెళ్లంటే అస్స‌లు ఇష్టం ఉండ‌దు. అత‌ని రిలేష‌న్ షిప్ స్టేట‌స్ కూడా అంద‌రికీ క్వ‌శ్చ‌న్ మార్క్‌లా ఉంటుంది. ఒంటరిగా ఉంటాడు. చ‌క్క‌గా వంట వండుతాడు. మోస్ట్ క‌న్‌ఫ్యూజ్డ్ డివోర్సి అనే లైన్ ఉన్న పోస్ట‌ర్ మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

మళ్ళీ మొదలైంది చిత్రంలో.. పెళ్లి, విడిపోవ‌డం అనే అంశాల‌పై ఓ సందిగ్ధ‌త నెల‌కొన్న యువ‌కుడిగా సుశాంత్ క‌నిపిస్తారు. ఆయ‌న‌కు జోడీగా నైనా  గంగూలీ న‌టించింది. రెడ్ సినిమాస్ బ్యాన‌ర్‌పై కె.రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రీక‌ర‌ణంతా పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధమ‌వుతోంది. సుహాసిని మ‌ణిర‌త్నం, వెన్నెల కిషోర్‌, మంజుల ఘ‌ట్ట‌మ‌నేని, పోసాని కృష్ణ ముర‌ళి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత ద‌ర్శ‌కుడు. జీఆర్ఎన్ సినిమాటోగ్రాఫ‌ర్.

న‌టీన‌టులు: సుమంత్‌, నైనా గంగూలి, సుహాసిని మ‌ణిర‌త్నం, వెన్నెల కిషోర్‌, మంజుల ఘ‌ట్ట‌మ‌నేని, పోసాని కృష్ణ ముర‌ళి త‌దిత‌రులు.

సాంకేతిక వ‌ర్గం: ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: టీజీ కీర్తి కుమార్‌, నిర్మాత‌: కె. రాజ‌శేఖ‌ర్ రెడ్డి, సంగీతం: అనూప్ రూబెన్స్‌, ఎడిటింగ్: ప్ర‌దీప్ ఇ రాఘ‌వ్‌, ఆర్ట్‌: అర్జున్ సురిశెట్టి, సీఈఒ: చ‌ర‌ణ్ తేజ్‌, పీఆర్ఓ: వంశీ - శేఖ‌ర్‌.

Malli Modalaindi Poster:

Sumanth Character Revealing Poster From Malli Modalaindi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ