చిరు 153వ చిత్రం షూటింగ్ ప్రారంభం

Chiru153 Movie Shooting Starts

మెగాస్టార్ చిరంజీవి, మోహ‌న్‌రాజా, కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్, సూప‌ర్‌గుడ్ ఫిల్మ్స్ కాంబినేష‌న్‌లో చిరంజీవి 153వ చిత్రం షూటింగ్ ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహ‌న్‌ రాజా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న కొత్త చిత్రం షూటింగ్‌ చిరు 153 అనే వర్కింగ్ టైటిల్‌తో శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, సూప‌ర్‌గుడ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌పై నిర్మిత‌మ‌వుతోన్న ఈ సినిమా షెడ్యూల్ భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌తో ప్రారంభ‌మైంది. మెగాస్టార్ చిరంజీవిపై ఈ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ మోహ‌న్‌రాజా ఈ చిత్రానికి గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేను స‌మ‌కూర్చారు. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ నిర‌వ్‌షా విజువ‌ల్స్ అందిస్తున్న ఈ చిత్రానికి ప‌లు బాలీవుడ్ చిత్రాల‌కు వ‌ర్క్ చేసిన‌ సురేశ్ సెల్వ‌రాజ‌న్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, త‌మ‌న్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న తొలి చిత్రంకావ‌డంతో త‌మ‌న్ చాలా ఎగ్జ‌యిట్‌మెంట్‌తో స్వరాల‌ను స‌మ‌కూరుస్తున్నారు. ఇప్ప‌టికే త‌మ‌న్ ఓ సాంగ్ కంపోజిష‌న్‌ను కూడా పూర్తి చేయ‌డం విశేషం.

స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: మోహ‌న్ రాజా, సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ: నిర‌వ్ షా, ఆర్ట్ డైరెక్ట‌ర్‌: సురేశ్ సెల్వ‌రాజ‌న్‌, నిర్మాణ సంస్థ‌లు:  కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, సూప‌ర్ గుడ్ ఫిలింస్‌, నిర్మాత‌లు: ఆర్‌.బి.చౌద‌రి, ఎన్‌.వి.ప్ర‌సాద్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: వాకాడ అప్పారావు.

Chiranjeevi 153 Movie Shooting Starts

chiranjeevi 153 movie starts
screenplay direction mohan raja
music s s thaman
producers rb choudary
nv prasad
ex-producer vakada apparao