Advertisementt

అల్ల‌రి న‌రేశ్ స‌భ‌కు న‌మ‌స్కారం.. ప్రారంభం

Thu 12th Aug 2021 07:43 PM
sabhaku namaskaram,allari naresh,sabhaku namaskaram movie,sabhaku namaskaram movie launched,director sateesh mallampati,producer mahesh koneru,music director sricharan pakala  అల్ల‌రి న‌రేశ్ స‌భ‌కు న‌మ‌స్కారం.. ప్రారంభం
Allari Naresh Sabhaku Namaskaram Movie Launched అల్ల‌రి న‌రేశ్ స‌భ‌కు న‌మ‌స్కారం.. ప్రారంభం
Advertisement
Ads by CJ

అల్ల‌రి న‌రేశ్, ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌ స‌భ‌కు న‌మ‌స్కారం.. లాంఛ‌నంగా ప్రారంభం

ఈ ఏడాది నాందితో సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టి, విల‌క్ష‌ణ న‌ట‌న‌తో ప్రేక్ష‌కులు, విమ‌ర్శకుల ప్ర‌శంస‌లు అందుకున్న అల్ల‌రి న‌రేశ్ హీరోగా.. ఇదే ఏడాది కోవిడ్ సెకండ్ వేవ్ త‌ర్వాత తిమ్మ‌రుసుతో సూప‌ర్‌హిట్‌ను సాధించిన‌ ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం స‌భ‌కు న‌మ‌స్కారం. స‌తీశ్ మ‌ల్లంపాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రానికి మ‌హేశ్ కోనేరు నిర్మాత‌. గురువారం ఈ చిత్రం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ముహూర్తపు స‌న్నివేశానికి న‌రేశ్ కుమార్తె అయాన క్లాప్ కొట్ట‌గా, పోకూరి బాబూరావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నాంది డైరెక్ట‌ర్ విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ముహూర్త‌పు స‌న్నివేశానికి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అబ్బూరి ర‌వి, అమ్మిరాజు, సుధీర్ స్క్రిప్ట్‌ను చిత్ర ద‌ర్శ‌కుడు స‌తీశ్ మ‌ల్లంపాటికి అందించారు. 

న‌రేశ్ 58వ చిత్ర‌మిది.  ఆయ‌న పుట్టిన‌రోజున విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమా రూపొందుతుంది. ఇలాంటి జోనర్‌లో న‌రేశ్ సినిమా చేయ‌డం ఇదే తొలిసారి. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా, శ్రీచ‌ర‌ణ్ పాకాల మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా, త‌మ్మిరాజు ఎడిట‌ర్‌, అబ్బూరి ర‌వి డైలాగ్ రైట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఈ సినిమాలోని ఇత‌ర నటీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

న‌టీన‌టులు: అల్ల‌రి న‌రేశ్.

సాంకేతిక నిపుణులు: ద‌ర్శ‌క‌త్వం: స‌తీశ్ మ‌ల్లంపాటి, నిర్మాత‌: మ‌హేశ్ కోనేరు, బ్యాన‌ర్‌: ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌, కెమెరా: ఛోటా కె.నాయుడు, సంగీతం: శ్రీచ‌ర‌ణ్ పాకాల‌, ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు, డైలాగ్స్‌: అబ్బూరి ర‌వి.

Allari Naresh Sabhaku Namaskaram Movie Launched:

 Allari Naresh, East Coast Productions Sabhaku Namaskaram launched

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ