Advertisementt

మంచి రోజులు వచ్చాయి నుంచి సిద్ శ్రీరామ్ సోసోగా ఉన్నా

Thu 12th Aug 2021 08:33 AM
manchi rojulu vachayi,manchi rojulu vachayi songs,manchi rojulu vachayi song release,maruthi,skn,  మంచి రోజులు వచ్చాయి నుంచి సిద్ శ్రీరామ్ సోసోగా ఉన్నా
Manchi Rojulu Vachayi Song Release మంచి రోజులు వచ్చాయి నుంచి సిద్ శ్రీరామ్ సోసోగా ఉన్నా
Advertisement
Ads by CJ

మారుతి, సంతోష్ శోభన్ కాంబినేషన్‌లో మంచి రోజులు వచ్చాయి నుంచి సిద్ శ్రీరామ్ సోసోగా ఉన్నా ప్రోమో సాంగ్ విడుదల..

యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా వరస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు మారుతి రూపొందిస్తున్న కొత్త సినిమా మంచి రోజులు వచ్చాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌కు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. ఏక్ మినీ కథ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యువ హీరో సంతోష్ శోభన్ ఈ చిత్రంలో మెయిన్ లీడ్ చేస్తున్నారు. మహానుభావుడు లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మారుతి కాంబినేషన్‌లో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను వి సెల్యులాయిడ్ SKN నిర్మిస్తున్నారు. టాక్సీవాలా తర్వాత ఈయన నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది. మారుతి, వి సెల్యులాయిడ్ SKN అంటే సూపర్ హిట్ కాంబినేషన్. ఈ కాంబోలో ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి సినిమా వస్తుంది. ఏక్ మినీ కథ లాంటి హిట్ సినిమాను నిర్మించిన యూవీ కాన్సెప్ట్స్‌తో మరోసారి జోడీ కట్టాడు సంతోష్ శోభన్. తాజాగా ఈ సినిమా నుంచి సోసో గా ఉన్న ప్రోమో సాంగ్ విడుదలైంది. సెన్సేషనల్ సింగర్ సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించారు. ఈ పాటను ప్రముఖ లిరిక్ రైటర్ కేకే రాసారు. ఆగస్ట్ 16న ఫుల్ సాంగ్ విడుదల కానుంది. ఈ ప్రోమో సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. మిగిలిన వివరాలు దర్శక నిర్మాతలు త్వరలోనే తెలియజేయనున్నారు.

నటీనటులు: సంతోష్ శోభన్, మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా..

టెక్నికల్ టీం: కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: మారుతి, నిర్మాత: వి సెల్యూలాయిడ్ స్కన్, బ్యానర్స్: యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్, సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్, సంగీతం: అనూప్ రూబెన్స్, పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్.

Manchi Rojulu Vachayi Song Release:

Manchi Rojulu Vachayi Song Release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ