Advertisementt

దెయ్యాలున్నాయా?

Mon 09th Aug 2021 10:44 PM
deyyalu unnaya movie.deyyalu unnaya movie launch,deyyalu unnaya movie photos  దెయ్యాలున్నాయా?
Deyyalu Unnaya Movie Launch దెయ్యాలున్నాయా?
Advertisement
Ads by CJ

శ్రీ ప్రణయ్ ఆర్ట్ ఫిలిం బ్యానర్ పై ఎల్ విజయ్ మనోహర్ రావు ( త్రయోటెక్స్ ) సమర్పణలో, కంకణాల శ్రీనివాస్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం దెయ్యాలున్నాయా? జైహింద్ గౌడ్ ప్రధాన పాత్రలో, హీరోయిన్ గా  ప్రియాంకా ( నూతన పరిచయం ) గౌతమ్ రాజు, హేమసుందర్, రఘునాధ్ రెడ్డి, వంశీ మాదారపు తదితరులు నటిస్తున్న దెయ్యాలున్నాయా? చిత్రం సోమవారం హైద్రాబాద్ లో  పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. జైహింద్ గౌడ్, ప్రియాంకా లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఏలూరు సురేందర్ రెడ్డి క్లాప్ ఇవ్వగా, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహ రెడ్డి స్విచ్ ఆన్ చేయగా, బీమ్ రెడ్డి మొదటి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం దర్శక నిర్మాత కంకణాల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ .. ప్రేతాత్మల కథాంశంతో తెరకెక్కిస్తున్న సినిమా ఇది. నలుగురు కుర్రాళ్ళు, ఇద్దరు అమ్మాయిలు మెయిన్ లీడ్ గా ఉంటారు. కామెడీ,  హర్రర్,థ్రిల్లర్ నేపద్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఓ ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. 25 రోజుల్లో సింగిల్ షెడ్యూల్లో చిత్రాన్ని పూర్తీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. దెయ్యాలున్నాయా అనే టైటిల్ అందరిలో ఆసక్తి రేకెత్తించేలా ఉంది. తప్పకుండా అందరికి నచ్చేలా  అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఈ సినిమా ఉంటుంది. మిగతా నటీనటులను త్వరలోనే ఎంపిక చేస్తాం అన్నారు. జైహింద్ గౌడ్ మాట్లాడుతూ .. ఈ కథ బాగా నచ్చింది. ముఖ్యంగా ఇందులో పాత్ర బాగా నచ్చింది కాబట్టి చేస్తున్నాను. ఇందులో నేను ప్రొఫెసర్ పాత్రలో కనిపిస్తాను అన్నారు.

నటీనటులు: జై హింద్ గౌడ్, ప్రియాంకా, గౌతమ్ రాజు, హేమసుందర్, రఘునాధ్ రెడ్డి, వంశీ మాదారపు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, కెమెరా, మాటలు, నిర్మాత, దర్శకత్వం: కంకణాల శ్రీనివాస్ రెడ్డి. పి ఆర్ ఓ : ఇ. జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ రావ్. 

Deyyalu Unnaya Movie Launch:

Deyyalu Unnaya Movie Launch

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ