Advertisementt

మ‌హా స‌ముద్రం నుంచి హే రంభ‌.. సాంగ్ రిలీజ్‌

Fri 06th Aug 2021 03:01 PM
maha samudram,maha samudram movie,sharwanand,siddharth,aditi rao hydari,anu emmanuel,director ajay bhupathi,jagapathi babu,rambha-ramba song  మ‌హా స‌ముద్రం నుంచి హే రంభ‌.. సాంగ్ రిలీజ్‌
Maha Samudram Hey Rambha Song Unveiled మ‌హా స‌ముద్రం నుంచి హే రంభ‌.. సాంగ్ రిలీజ్‌
Advertisement
Ads by CJ

శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్‌, అజ‌య్ భూప‌తి కాంబినేష‌న్‌లో ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ రూపొందిస్తోన్న చిత్రం మ‌హా స‌ముద్రం నుంచి హే రంభ‌.. సాంగ్ రిలీజ్‌.

ఓ సినిమాకు సంబంధించిన ప్ర‌తి అప్‌డేట్ సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డ‌మ‌నేది అరుదుగా జ‌రిగే విష‌యం. అలాంటి అరుదైన విష‌యాలు మ‌హా స‌ముద్రం సినిమా అప్‌డేట్స్ విష‌యంలో జ‌రుగుతున్నాయి. అంద‌రిలో అంచ‌నాలు పెంచుతున్న ఈ సినిమా విడుద‌ల కోసం అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రామిసింగ్ యాక్ట‌ర్స్ శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ హీరోలుగా అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ రూపొందుతోంది. ఈ సినిమా మ్యూజిక‌ల్ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా విడుద‌లైన చిన్న సాంగ్ ప్రోమోకు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. చైత‌న్య భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం నుంచి తొలి సాంగ్‌గా హే రంభ‌.. అనే పాట ప్రోమోను చూస్తే రెగ్యుల‌ర్ మాస్ నెంబ‌ర్ కాద‌నిపిస్తోంది. అలాగే ఎవ‌ర్‌గ్రీన్ హీరోయిన్‌కు ఇది ట్రిబ్యూట్‌గా తెర‌కెక్కించినట్లు అర్థ‌మ‌వుతుంది.

ఈ సాంగ్ బీట్ వింటుంటే సాధార‌ణ‌మైన స్పెష‌ల్ సాంగ్‌లా కూడా అనిపించ‌డం లేదు. స్పెష‌ల్ లుక్‌తో డాన్సింగ్ బీట్‌ను అందించారు మ్యూజిక్ డైరెక్ట‌ర్. ఈ పాట‌లో క‌న‌ప‌డే, రంభ గ్లామ‌ర్ క‌టౌట్‌, బ్యాన‌ర్స్‌, ఫొటోలు చూస్తుంటే రంభ ఫ్యాన్స్ అసోసియేష‌న్ ఆమె పుట్టిన‌రోజు భారీ ఎత్తున సెల్ర‌బేట్ చేసే సంద‌ర్భంగా అనిపిస్తుంది. శ‌ర్వానంద్‌, జ‌గ‌ప‌తిబాబు ఈ ప్రోమోలో రంభ‌పై త‌మ ప్రేమాభిమానాల‌ను చూపిస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. అలాగే ఇద్ద‌రి లుక్స్ ప‌క్కా మాస్‌గా ఉంది. వారిద్ద‌రి డాన్స్ కూడా చాలా ఫ‌న్‌ను క్రియేట్ చేస్తుంది.

చైత‌న్య భ‌రద్వాజ్ ఈ పాట‌ను త‌న‌దైన స్టైల్లో డిఫ‌రెంట్‌గా పాడారు. భారీత‌నంతో రూపొందిన ఈ పాట‌ను భాస్క‌ర భ‌ట్ల రాసిన ఈ పాట‌కు జానీ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ అందించారు. ఇన్‌టెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న మ‌హా స‌ముద్రంను ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైద‌రీ, అను ఇమ్మాన్యుయ‌ల్ హీరోయిన్స్‌. రాజ్ తోట సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి చైత‌న్య భ‌రద్వాజ్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. ప్ర‌వీణ్ కె.ఎల్ ఎడిట‌ర్‌, కొల్లా అవినాశ్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌. ఈ సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.

నటీన‌టులు: శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్‌, జ‌గ‌ప‌తిబాబు, అదితిరావు హైద‌రీ, అను ఇమ్మాన్యుయేల్ త‌దిత‌రులు

 సాంకేతిక వ‌ర్గం: ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: అజ‌య్ భూప‌తి, ప్రొడ్యూస‌ర్‌: సుంక‌ర్ రామ‌బ్ర‌హ్మం, కో ప్రొడ్యూస‌ర్‌: అజ‌య్ సుంక‌ర‌, బ్యాన‌ర్‌: ఏకే ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కిషోర్ గరిక‌పాటి, మ్యూజిక్‌: చైత‌న్య భ‌ర‌ద్వాజ్‌, సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ తోట‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: కొల్లా అవినాశ్‌, ఎడిట‌ర్‌: ప్ర‌వీణ్ కె.ఎల్‌, యాక్ష‌న్‌: వెంక‌ట్‌, పి.ఆర్‌.ఓ: వంశీ శేఖర్‌

Maha Samudram Hey Rambha Song Unveiled:

Maha Samudram ready for theatrical release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ