Advertisementt

మ్యాడ్ సినిమా ప్రీ రిలీజ్

Wed 04th Aug 2021 07:23 PM
mad movie,mad movie pre release  మ్యాడ్ సినిమా ప్రీ రిలీజ్
Mad Movie Pre Release మ్యాడ్ సినిమా ప్రీ రిలీజ్
Advertisement

మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ  ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా మ్యాడ్. మోదెల టాకీస్  బ్యాన‌ర్ పై టి. వేణు గోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి మరియు  మిత్రులు నిర్మాత‌లుగా  లక్ష్మణ్ మేనేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం ఈనెల 6న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మ్యాడ్ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొని తమ సంతోషాన్ని పంచుకున్నారు.

నటి ఇందు మాట్లాడుతూ.. మా ఇంట్లో వాళ్లు, నా ఫ్రెండ్స్ నన్ను ఆర్ యూ మ్యాడ్ అంటారు. ఈ పోస్టర్ నాకు పంపి డైరెక్టర్ గారు పిలిచినప్పుడు చాలా క్రేజీగా ఉంది సార్ అని వెళ్లి కథ విన్నాను. చాలా మంచి స్టోరీ. మా డైరెక్టర్ గారు ఎప్పుడూ స్ట్రెస్ ఫీల్ అవరు. మ్యాడ్ మూవీ కోసం పనిచేయడం ప్లెజంట్ గా అనిపించింది. హీరో హీరోయిన్స్ తో పనిచేయడం చాలా కంఫర్ట్ గా అనిపించింది. మా సినిమా కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ద బెస్ట్. సినిమా చూసి మమ్మల్ని విష్ చేయండి. అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఏలూరు శ్రీను మాట్లాడుతూ.. సినిమా మీదున్న ప్యాషన్ తో నేను సినిమా చేద్దామనుకుంటున్న టైమ్ లో లక్ష్మణ్ గారిని కలవడం, అలా సినిమా స్టార్ట్ చేశాం. థియేటర్ లో విడుదల చేద్దామనే ఉద్దేశంతోనే ఇన్నాళ్లూ రిలీజ్ ఆపాం. న్యూ ఏజ్ కపుల్స్ స్టోరీ ఇది. వాళ్ల మ్యారేజ్ లైఫ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా డీల్ చేశారని చూపించాం. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.

సంగీత దర్శకుడు మోహిత్ రెహ్మానియానిక్ మాట్లాడుతూ.. మ్యాడ్ చిత్రంలో సూఫీ పాట కంపోజ్ చేశాం. ఇది హిందీలోనే రాయించి, అలాగే చిత్రంలో ఉంచాం. కైలాష్ ఖేర్ గారు ఆ పాటను అద్భుతంగా పాడారు. ఈ సినిమా మ్యూజిక్ కోసం నేను చెప్పిన రిక్వైర్ మెంట్స్ కు దర్శకుడు లక్ష్మణ్ గారు చాలా సపోర్ట్ చేశారు. సినిమా కోసం తప్పకుండా చేద్దామని ముందుకొచ్చారు. మ్యాడ్ మీరు వచ్చి చూసి మర్చిపోయే సినిమా కాదు. అలా గుర్తుండిపోతుంది. విక్రమ సింహా అనే సినిమా తర్వాత సింగర్ ఉన్నికృష్ణన్ మా సినిమాలో పాట పాడారు. ఈ చిత్రంతో నాకు దక్కిన అదృష్టం అనుకుంటున్నాను. ప్లీజ్ కం అండ్ వాచ్  అవర్ మూవీ అన్నారు.

ఈ సందర్భం గా దర్శకుడు లక్ష్మణ్ మేనేని మాట్లాడుతూ.. మా ఫ్రెండ్స్ సపోర్ట్ తో మ్యాడ్ సినిమా చేశాను. ఈ సినిమా చేసి వెళ్లిపోదాం అనుకున్నాను. కానీ మా కాస్ట్ అండ్ క్రూతో ఒక అనుబంధం ఏర్పడింది. ఇక్కడికొచ్చాక తెలిసింది ఇంత ప్రాణం పెట్టి సినిమా చేస్తారా అని మ్యాడ్ మూవీ ఒక ఫీస్ట్ లా ఉంటుంది. రెగ్యులర్ చిత్రంలా ఉండదు. సినిమా చూసి బాగుంటే చాలా బాగుందని చెప్పండి. థాంక్స్ టు ఆల్ అన్నారు.

నిర్మాత కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మా సినిమాకు వేణుగోపాల్ రెడ్డి గారు రియల్ ఫిల్లర్   అన్నారు. మా పదేళ్ల కల మ్యాడ్ సినిమా. మా కాస్ట్ అండ్ క్రూ గురించి చెబితే మమ్మల్ని మేము పొగుడుకున్నట్లు అవుతుంది. ఈ సినిమా సక్సెస్ అయితే చాలా మందికి హోప్ ఇవ్వగలం అనుకుంటున్నాం. అన్నారు.

Mad Movie Pre Release:

Mad Movie Pre Release Ceremony

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement