Advertisementt

ఇందువ‌ద‌న టీజ‌ర్

Wed 04th Aug 2021 07:11 PM
induva‌da‌na movie,induva‌da‌na movie teaser,indu va‌da‌na look,indu va‌da‌na movie,varun sandesh,raghavendra rao,induva‌da‌na  ఇందువ‌ద‌న టీజ‌ర్
Induva‌da‌na Teaser ఇందువ‌ద‌న టీజ‌ర్
Advertisement
Ads by CJ

ద‌ర్శ‌కేంద్రుడు శ్రీ రాఘ‌వేంద్ర‌రావు గారు చేతులు మీదుగా విడుద‌లైన వ‌రుణ్ సందేశ్, ఫ‌ర్నాజ్ శెట్టి ఇందువ‌ద‌న టీజ‌ర్

శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై MSR దర్శకత్వంలో శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న చిత్రం ఇందువదన. వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ఇందులో జంటగా నటిస్తున్నారు. చాలా ఏళ్ళ తర్వాత ఇందువదన సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్ సందేశ్. ఇందువదన ఫస్ట్ లుక్, వ‌రుణ్ సందేశ్, ఫ‌ర్నాజ్ శెట్టి క్యారెక్ట‌ర్స్ ఇంట్రో లుక్స్ చాలా కళాత్మకంగా ఉండటంతో అనూహ్యమైన స్పందన ల‌భించింది, అలానే ఇటీవ‌లే విడుద‌లైన ఈ సినిమా ఫ‌స్ట్ సింగిల్ సాంగ్ యూ ట్యూబ్ లో మిలియ‌న్ వ్యూస్ తెచ్చుకోవ‌డ‌మే కాకుండా చార్ట్ బ‌స్ట‌ర్ గా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ద‌ర్శ‌కేంద్రుడు శ్రీ రాఘ‌వేంద్ర‌రావు గారు చేతులు మీదుగా విడుద‌లైన ఇందువ‌ద‌న టీజ‌ర్ ప్ర‌స్తుతం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవ‌డ‌మే కాకుండా సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుండ‌టం విశేషం. ఈ టీజ‌ర్ లాంఛ్ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ ప్ర‌సాద్ లాబ్స్ లో ఘ‌నంగా జ‌రిగింది.  ఈ సినిమాకు కథ, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, బి మ‌ర‌ళికృష్ణ సినిమాటోగ్రాఫి బాధ్య‌త‌లు తీసుకున్నారు.

వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. ఈ మధ్య నేను సినిమా చేస్తే మా తాతయ్య  చూడలనుకున్నాడు. కానీ మా తాతయ్య లాస్ట్ ఇయర్ చనిపోయాడు.. ఈ చిత్రం బాగా వచ్చింది.

దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ.. ఇందువ‌ద‌న చిత్రానికి సంబంధించిన చిత్రీక‌ర‌ణ పూర్తై ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అతి త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన విడుద‌ల తేదీతో పాటు మ‌రిన్ని వివ‌రాలు ప్ర‌క‌టిస్తామ‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు తెలిపారు.

హీరోయిన్ ఫర్నాజ్ శెట్టి, మాట్లాడుతూ.. ఈ చిత్రం లో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.

నటీనటులు : వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి, రఘు బాబు, అలీ, నాగినీడు, సురేఖ వాణి, ధనరాజ్, తాగుబోతు రమేష్, మహేష్ విట్ట, పార్వతీషం, వంశీ కృష్ణ ఆకేటి, దువ్వాసి మోహన్, జ్యోతి, కృతిక (కార్తికదీపం ఫేమ్), అ౦బఋషి,జెర్సీ మోహన్ తదితరులు.

టెక్నికల్ టీం: దర్శకుడు: MSR, బ్యానర్: శ్రీ బాలాజీ పిక్చర్స్, నిర్మాత: శ్రీమతి మాధవి ఆదుర్తి, కో. ప్రొడ్యూసర్: గిరిధర్, కథ, మాటలు: సతీష్, కేటి

కెమెరా: బి ముర‌ళి కృష్ణ‌, సంగీతం: శివ కాకాని, కో డైరెక్టర్: ఉదయ్ రాజ్, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: వై నాగు, లిరిక్స్: భాస్కరబట్ల, తిరుపతి జావన, లైన్ ప్రొడ్యూసర్స్: సూర్యతేజ ఉగ్గిరాల, వర్మ, పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్.

Induva‌da‌na Teaser:

Induva‌da‌na Movie Teaser

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ