Advertisementt

రాజా రాజు వచ్చే లోకాలు మెచ్చే..

Wed 28th Jul 2021 06:17 PM
raja raja chora movie,raja raja chora lyrical song,sri vishnu  రాజా రాజు వచ్చే లోకాలు మెచ్చే..
Raja Raja Chora Lyrical Song Release రాజా రాజు వచ్చే లోకాలు మెచ్చే..
Advertisement
Ads by CJ

శ్రీవిష్ణు రాజ రాజ చోర చిత్రం నుండి రాజా రాజు వచ్చే లోకాలు మెచ్చే లిరికల్ సాంగ్ విడుదల.

యంగ్‌ అండ్‌ ప్రామిసింగ్‌ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న తాజా ఎంటర్‌టైనర్‌ మూవీ రాజ రాజ చోర. ఇప్పటికే విడుదలైన టీజర్  ఫ్రెష్‌ కంటెంట్‌తో హిలేరియస్‌గా ఉండడంతో  ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక టీజర్‌లో శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్స్, హిట్‌ ఇస్తున్న కామెడీ, బాడీ లాంగ్వేజ్, కంటెంట్‌ను బట్టి రాజ రాజ చోర హాండ్రెండ్‌ పర్సెంట్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనుందని తెలుస్తుంది.

ఈ చిత్రం నుండి రాజా రాజు వచ్చే లోకాలు మెచ్చే సాంగ్ ను ఈ రోజు విడుదల చేసింది చిత్ర యూనిట్. దొరలని మీకు మీరు దొరులుతు తిరిగారు.. చొరబడి చెడిపోతే చతికిల పడతారు.. రాజా రాజు వచ్చే లోకాలు మెచ్చే అంటూ సాగే ఈ పాటకు వివేక్ సాగర్ క్యాచీ ట్యూన్స్ ఇచ్చారు. హసిత్ గోలి సాహిత్యం అందించిన ఈ పాటను మోహన భోగరాజు ఆలపించారు. ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హసిత్‌ గోలి దర్శకత్వం వహిస్తున్నారు. వివేక్‌ సాగర్‌ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రానికి వేదరామన్‌ కెమెరామ్యాన్‌గా బాధ్యతలు స్వీకరించారు.

తారాగణం: శ్రీ విష్ణు, మేఘా ఆకాష్, సునైన, తనికెళ్ళభరణి, గంగవ్వ, అజయ్‌ ఘోష్‌.

సాంకేతిక విభాగం: రైటర్, డైరెక్టర్‌: హసిత్‌ గోలి, ప్రొడ్యూసర్స్‌: టీవీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: కీర్తీ చౌదరి, కో ప్రొడ్యూసర్‌: వివేక్‌ కూచిభొట్ల, మ్యూజిక్‌: వివేక్‌ సాగర్‌, సినిమాటోగ్రఫీ: వేదరామన్‌, ఎడిటింగ్‌: విప్లవ్‌, ఆర్ట్‌: కృష్ణకుమార్‌ మన్నే, స్టైలింగ్‌: శ్రుతి కొర్రపాటి.

Raja Raja Chora Lyrical Song Release:

Raja Raja Chora Lyrical Song Release.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ