Advertisementt

ఫిలిం క్రిటిక్స్ క‌మిటీకి మెగాస్టార్ శుభాభినంద‌న‌లు

Mon 26th Jul 2021 05:06 PM
film critics,megastar,film critics committee,film critics president prabhu,film critics secretary parvathaneni rambabu,fca  ఫిలిం క్రిటిక్స్ క‌మిటీకి మెగాస్టార్ శుభాభినంద‌న‌లు
Megastar Best Wishes to the Film Critics Committee ఫిలిం క్రిటిక్స్ క‌మిటీకి మెగాస్టార్ శుభాభినంద‌న‌లు
Advertisement
Ads by CJ

ఫిలిం క్రిటిక్స్ అసోసియేష‌న్ నూత‌న కార్య‌వ‌ర్గానికి మెగాస్టార్ చిరంజీవి శుభాభినంద‌న‌లు

ఆదివారంనాడు ఎంపికైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి సోమ‌వారంనాడు మెగాస్టార్ చిరంజీవి శుభాభినందనలు తెలియ‌జేశారు. అధ్య‌క్షునితోపాటు కార్య‌వ‌ర్గ‌స‌భ్యుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. చిరంజీవిగారు ముందుగా అధ్య‌క్షుడు ప్ర‌భుకి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అలాగే మిగిలిన క‌మిటీ స‌భ్యుల‌కు నా శుభాకాంక్ష‌లు తెలియ‌జేయండ‌ని తెలిపారు.

ఇంకా ఆయ‌న మాట్లాడుతూ, అధ్య‌క్షులైన మీరు (ప్ర‌భు) ఇదొక మంచి అవ‌కాశంగా భావించి మీ వాళ్ళంద‌రికీ మంచి చేయ‌డానికీ, వారి సంక్షేమం కోసం మీ సేవ‌లు అందించ‌డానికి ప్ర‌య‌త్నం చేయండి. దానికి ఇదో చ‌క్క‌ని అవ‌కాశం. స‌ద్వినియోగ ప‌ర‌చుకోండి. ప‌ద‌వి అలంకారం కాకుండా బాధ్య‌త‌గా ప‌నిచేయండి. ప‌దిమందికి ఉప‌యోగ‌ప‌డండి. త‌ద్వారా మాన‌సిక ఆనందం ఎంత వుంటుందో ఊహించ‌లేరు. అలాగే నా మిత్రులైన మిగిలిన వారంతా మీ మార్కు సేవ‌లు అందించండి. ఎలాంటి విమ‌ర్శ‌ల‌కు తావులేకుండా అంద‌రికీ త‌ల‌లో నాలుక‌లా వుండాల‌నీ, వుంటార‌ని అనుకుంటున్నాను. మ‌రొక్క‌సారి శుభాభినంద‌న‌లు తెలియ‌జేస్తూ..

మీ చిరంజీవి.

Megastar Best Wishes to the Film Critics Committee:

Megastar Congratulations to the Film Critics Committee

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ