Advertisementt

విశాల్ ఎనిమి టీజర్

Sat 24th Jul 2021 06:39 PM
vishal - arya combo,kollywood hero vishal,arya,enemy teaser,enemy movie,enemy teaser launch  విశాల్ ఎనిమి టీజర్
Vishal Enemy teaser released విశాల్ ఎనిమి టీజర్
Advertisement
Ads by CJ

యాక్షన్‌ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్‌ ఆర్య కలిసి నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఎనిమీ. పది సంవత్సరాల క్రితం దర్శకులు బాలా తెరకెక్కించిన వాడు–వీడు సినిమా తర్వాత వీరిద్ద‌రు క‌లిసి న‌టిస్తోన్న చిత్ర‌మిది. ఇది హీరో విశాల్‌ 30వ చిత్రం కాగా, ఆర్యకు 32వ మూవీ. గద్దల కొండ గణేష్‌ ఫేమ్‌ మృణాళిని రవి, మ‌మ‌తా మోహ‌న్‌దాస్‌ హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఒక కీలక పాత్రలో నటించారు. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో మినీ స్టూడియోస్‌ పతాకంపై వినోద్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవ‌ల ఈ మూవీ షూటింగ్ పూర్త‌య్యింది. విశాల్‌, ఆర్య అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఎనిమి మూవీ టీజ‌ర్‌ని ఈ రోజు విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. 

స్టైలీష్ లుక్‌లో విశాల్ ఎంట్రీతో ప్రారంభమైన ఒక నిమిషం న‌ల‌భై సెకండ్ల నిడివిగ‌ల ఈ టీజ‌ర్ ఆధ్యంతం ఆస‌క్తిక‌రంగా సాగింది. విశాల్, ఆర్య‌ల హై ఓల్టేజ్ యాక్ష‌న్ ప్యాక్డ్‌ పెర్‌ఫామెన్స్‌లు ఈ టీజ‌ర్‌కి హైలెట్‌గా నిలిచాయి. ఇక టీజ‌ర్ చివ‌ర‌లో ప్ర‌పంచంలోనే ప్ర‌మాద‌క‌ర‌మైన శ‌త్రువు ఎవ‌రో తెలుసా...నీ గురించి అంతా తెలిసిన నీ స్నేహితుడే ..అని ప్ర‌కాశ్ రాజ్ చెప్పే డైలాగ్ ఈ టీజ‌ర్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లింది. ఆర్‌ డి రాజశేఖర్ విజువ‌ల్స్,  బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇచ్చాయి. ఈ టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను భారీగా పెంచింది. సెప్టెంబ‌రులో తెలుగు, తమిళం, హిందీ స‌హా మరికొన్ని భాషలలో ఈ చిత్రం విడుదలకానుంది. 

Vishal Enemy teaser released :

Vishal - Arya Enemy teaser Launch

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ