Advertisementt

విజయ్ ఆంటోనీ బిచ్చగాడు 2 లుక్

Sat 24th Jul 2021 03:04 PM
vijay anthony,bichagadu 2 movie look,murugadas,vijay anthony bichagadu 2  విజయ్ ఆంటోనీ బిచ్చగాడు 2 లుక్
Murugadoss reveals Bichagadu 2 Director విజయ్ ఆంటోనీ బిచ్చగాడు 2 లుక్
Advertisement
Ads by CJ

తమిళ సినీ పరిశ్రమలో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించి ప్రేక్షకులను అలరించిన విజయ్ ఆంటోనీ నటుడిగా మారి విభిన్నమైన చిత్రాలు చేసుకుంటూ వచ్చారు. అయన హీరోగా తెరకెక్కిన బిచ్చగాడు సినిమా ఎంతటి గొప్ప విజయాన్ని సాధించిందో తెలిసిందే.. తెలుగునాట సైతం ఈ సినిమా ఎన్నో రికార్డులను సృష్టించింది. ఒక డబ్బింగ్ సినిమా ఈ రేంజ్ లో రికార్డులు సృష్టించడం అంటే మాములు విషయం కాదు. ఆ సినిమా తో మంచి పాపులారిటీ అందుకున్న విజయ్ ఆంటోనీ ఆ తర్వాత ఎన్నో చిత్రాలు చేసి మంచి మార్కెట్ ను ఏర్పరుచుకున్నారు.

 తెలుగులో సైతం అయన సంగీతం అందించిన కొన్ని సినిమాలు హిట్ గా నిలిచాయి. ఎడిటర్ గా కూడా అయన కొన్ని సినిమాలకు పనిచేయగా ప్రస్తుతం తొలిసారి అయన దర్శకత్వం వహిస్తుండడం విశేషం.. విడుదలైన అన్ని భాషలలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న బిచ్చగాడు సినిమా కి కొనసాగింపుగా బిచ్చగాడు 2  సినిమా ని అయన తన స్వీయ దర్శకత్వంలో నటిస్తున్నాడు.. ఇప్పటివరకు సంగీత దర్శకుడిగా, ఎడిటర్ గా, హీరోగా విజయవంతం అయినా విజయ్ ఆంటోనీ దర్శకుడిగా మెప్పించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా కి సంబందించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి. తొలి భాగాన్ని తెరకెక్కించిన విజయ్ ఆంటోనీ ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంస్థే ఈ చిత్రాన్నీ నిర్మిస్తుంది. ప్రముఖ రచయిత భాష్య శ్రీ ఈ సినిమా కి మాటలు అందిస్తున్నారు.

ఇక ఈరోజు విజయ్ ఆంటోనీ పుట్టిన రోజు కావడంతో ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ఈ చిత్రానికి సంబందించిన లుక్ ని విడుదల చేసింది చిత్ర బృందం. ఆయనను దర్శకుడిగా అనౌన్స్ చేస్తూ ప్రముఖ దర్శకుడు మురుగదాస్ ఈ చిత్ర పోస్టర్ ను విడుదల చేశాడు.

Murugadoss reveals Bichagadu 2 Director:

Vijay Anthony Bichagadu 2 movie look 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ