Advertisementt

105 మినిట్స్ షూటింగ్ ప్రారంభం

Wed 21st Jul 2021 06:17 PM
105 minutes movie,105 minutes,105 minutes hansika motwani,hansika motwani  105 మినిట్స్ షూటింగ్ ప్రారంభం
105 Minutes Shooting begins 105 మినిట్స్ షూటింగ్ ప్రారంభం
Advertisement
Ads by CJ

కొత్త చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాను. చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది. ఈ టీమ్ కి ఆల్ ది బెస్ట్ అంటూ తన ట్విట్టర్ హ్యాండిల్ లో ట్వీట్ చేసారు బబ్లీ గర్ల్ హన్సిక. ఇంతలా తను ఎగ్జయిట్ అవ్వడానికి కారణం ప్రస్తుతం హన్సిక చేస్తున్న తాజా చిత్రం 105 మినిట్స్. ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్ తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ కధనం తో తెరకెక్కుతోన్న చిత్రం 105 మినిట్స్. షూటింగ్ స్పాట్ లోనే ఎడిటర్ శ్యామ్ గారు పర్యవేక్షిస్తున్నారు. సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్, రీల్ టైం & రియల్ టైం  ఈ చిత్రానికి హైలైట్స్.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ సమీపంలోని ఓ విల్లాలో జరుగుతోంది. ఈ షూటింగ్ లో జాయిన్ అయిన హన్సిక పై విధంగా ట్వీట్ చేసారు. రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మాణంలో రాజు దుస్సా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సామ్ సి.యస్ సంగీతం సమకూర్చుతున్నారు. కిషోర్  బొయిదాపు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి యాక్షన్ డైరెక్టర్ మల్లి.

సాంకేతిక వర్గం: నిర్మాత - బొమ్మక్ శివ, డైరెక్టర్ - రాజు దుస్సా, డిఓపి - కిషోర్ బొయిదాపు, మ్యూజిక్ - సామ్ సి.యస్, ఆర్ట్ - బ్రహ్మ కడలి, స్రిప్ట్ చీఫ్ అసోసియేట్ - రూపాకిరణ్ గంజి, స్టిల్స్ - గుణకర్, మేకప్ - డెక్క బాలు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ - సురేష్ బాబు, పబ్లిసిటీ డిజైనర్ - సుధీర్, పిఆర్ఓ - రాజ్ కమల్.

105 Minutes Shooting begins:

105 Minutes Movie Shooting begins

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ