Advertisementt

శ‌ర్వానంద్‌ ఒకే ఒక జీవితం ప్రోమో

Thu 15th Jul 2021 06:45 PM
sharwanand,shree karthick,dream warrior pictures,oke oka jeevitham movie  శ‌ర్వానంద్‌ ఒకే ఒక జీవితం ప్రోమో
Sharwanan Oke Oka Jeevitham Promo Out శ‌ర్వానంద్‌ ఒకే ఒక జీవితం ప్రోమో
Advertisement
Ads by CJ

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శ‌ర్వానంద్ కెరీర్‌లో రూపొందుతోన్న 30వ చిత్రం ఒకే ఒక జీవితం. ఈ చిత్రం ద్వారా శ్రీ కార్తిక్  ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్ ఆర్ ప్ర‌కాశ్ బాబు, ఎస్ ఆర్ ప్ర‌భు నిర్మిస్తున్నారు. సైన్స్‌ఫిక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా  రూపొందుతున్న‌ ఈ చిత్రానికి త‌రుణ్ భాస్క‌ర్ డైలాగ్స్ అందిస్తున్నారు.

ఇటీవ‌ల విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ రోజు ఈ సినిమాలో శర్వానంద్ పోషించిన ఆది పాత్ర‌కి సంభందించి ఒక‌ స్నీక్ పీక్ ప్రోమోను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఈ వీడియోలో పాట పాడమని కొంద‌రు ఆదీని కోరడం అలాగే మ్యూజిక్ ఇన్స్‌ట్రూమెంట్స్ ని చూపిస్తూ తరువాత కొన్ని సైన్స్ ఫిక్షన్ అంశాల‌తో ఈ ప్రోమో ముగుస్తుంది. చివ‌ర‌లో శర్వానంద్ గిటార్ వాయించడం మ‌నం చూడొచ్చు. మొత్తానికి ఈ ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్ గా  ఉంది. శ‌ర్వానంద్ స‌ర‌స‌న మ‌న తెలుగ‌మ్మాయి రీతు వ‌ర్మ‌హీరోయిన్ గా న‌టిస్తుండగా వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి స‌పోర్టింగ్ రోల్స్ లో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని అమ‌ల ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌డం విశేషం.

ఇప్ప‌టికే ఒకే ఒక జీవితం మూవీ షూటింగ్ పూర్త‌య్యింది. త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ద‌మైంది.

Sharwanan Oke Oka Jeevitham Promo Out:

Sharwanand, Shree Karthick, Dream Warrior Pictures Oke Oka Jeevitham Promo Out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ