Advertisementt

విశాల్ - ఆర్య ఎనిమీ షూటింగ్‌ పూర్తి

Tue 13th Jul 2021 02:50 PM
action hero vishal,aarya,multistarrer biggie,enemy movie,enemy shoot completed  విశాల్ - ఆర్య ఎనిమీ షూటింగ్‌ పూర్తి
Vishal Enemy Shoot Completed విశాల్ - ఆర్య ఎనిమీ షూటింగ్‌ పూర్తి
Advertisement
Ads by CJ

యాక్షన్‌ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్‌ ఆర్య కలిసి నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఎనిమీ. పది సంవత్సరాల క్రితం దర్శకులు బాలా తెరకెక్కించిన వాడు–వీడు సినిమా తర్వాత వీరిద్ద‌రు క‌లిసి న‌టిస్తోన్న చిత్ర‌మిది.  ఇది హీరో విశాల్‌ 30వ చిత్రం కాగా, ఆర్యకు 32వ మూవీ. గద్దల కొండ గణేష్‌ ఫేమ్‌ మృణాళిని రవి హీరోయిన్ గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఒక కీలక పాత్రలో నటించారు. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో మినీ స్టూడియోస్‌ పతాకంపై వినోద్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా  ఎనిమీ షూటింగ్‌ పూర్తయింద‌ని హీరో విశాల్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా...

ఎనిమీ చిత్రీకరణను విజయవంతగా పూర్తి చేశాం. టీజర్‌ విడుదలకు అంతా సిద్ధమైంది. ఇటువంటి లవ్లీ టీమ్‌తో వర్క్‌ చేసినందుకు సంతోషంగా ఉంది. ఆర్యతో కలిసి మళ్లీ వర్క్‌ చేసినందుకు ఆనందంగా ఉంది. ఇంత మంచి ప్రాజెక్ట్‌లో భాగమైన దర్శకుడు ఆనంద్‌శంకర్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్, కెమెరామ్యాన్‌ ఆర్‌డి రాజశేఖర్, నిర్మాత వినోద్‌ కుమార్‌లతో పాటు చిత్రయూనిట్‌ అందరికీ ధన్యవాదలుఅని విశాల్‌ పేర్కొన్నారు.

Vishal Enemy Shoot Completed:

Action Hero Vishal, Aarya Multistarrer Biggie Enemy Shoot Completed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ