Advertisementt

యూట్యూబ్ డైమండ్ లహరి సొంతం

Sat 10th Jul 2021 01:51 PM
lahari music,youtube diamond award,you tube,  యూట్యూబ్ డైమండ్ లహరి సొంతం
Lahari Music wins the YouTube Diamond Award యూట్యూబ్ డైమండ్ లహరి సొంతం
Advertisement
Ads by CJ

యూట్యూబ్ డైమండ్ అవార్డ్ సొంతం చేసుకున్న లహరి మ్యూజిక్

లహరి మ్యూజిక్ సంస్థ శుక్రవారం యూట్యూబ్ నుంచి యూట్యూబ్ డైమండ్ అవార్డును సొంతం చేసుకుంది. సౌత్ ఇండియాలో ఇప్పటి వరకు ఏ మ్యూజిక్ సంస్థకు దక్కని గౌరవాన్ని దక్కించుకుంది. గత సంవత్సరం నవంబర్ నెలలో ఒక కోటి సబ్‌స్ర్కైబర్స్‌ని రీచ్ అయిన ఈ ఐకానిక్ మ్యూజిక్ కంపెనీ.. ప్రస్తుతం ఒక కోటి 18 లక్షల సబ్‌స్ర్కైబర్స్‌‌తో దూసుకుపోతుంది. 10 సంవత్సరాల క్రితం డిజిటల్ ఫార్మెట్‌లోకి ఎంటరై.. యూట్యూబ్ చానల్ స్థాపించిన లహరి.. ప్రేక్షకులను కన్నడ, తెలుగు, తమిళం మరియు మలయాళ భాషలలోని పాటలతో అలరిస్తోంది.

యూట్యూబ్ డైమండ్ అవార్డ్ అందుకున్న సందర్భంగా లహరి వేలు మాట్లాడుతూ.. ఈ అవార్డును అందుకునేందుకు రీచ్ అయినందుకు సంతోషంగా ఉంది. ఈ అవార్డును కర్నాటక ప్రజలకు అంకితమిస్తున్నాము. 45 సంవత్సరాల నుంచి వారందిస్తున్న సపోర్ట్ మరవలేనిది. చిన్న కంపెనీ నుంచి ఈ రోజు ఈ స్థాయికి లహరి చేరడానికి వారి సహకారం ఎంతో ఉంది. అందుకే ఈ అవార్డు వారిదే. అలాగే తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.. అన్నారు.

Lahari Music wins the YouTube Diamond Award:

Lahari Music wins the YouTube Diamond Award

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ