Advertisementt

స్టాండప్‌ రాహుల్‌ టీజర్‌

Fri 09th Jul 2021 05:45 PM
stand up rahul movie,raj tarun,rana releases stand up rahul teaser,stand up rahul teaser  స్టాండప్‌ రాహుల్‌ టీజర్‌
Stand Up Rahul teaser released స్టాండప్‌ రాహుల్‌ టీజర్‌
Advertisement
Ads by CJ

యంగ్‌ అండ్‌ ప్రామిసింగ్‌ హీరో రాజ్‌తరుణ్‌ స్టాండప్‌ కమేడియన్‌గా నటిస్తున్న తాజా చిత్రం స్టాండప్‌ రాహుల్‌. సాంటో మోహన్‌ వీరంకి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా స్టాండప్‌ రాహుల్‌ సినిమా టీజర్‌  హీరో దగ్గుబాటి రానా చేతులమీదుగా విడుదలైంది. స్టేజ్‌పై రాజ్‌తరుణ్‌ స్టాండప్‌ కమేడియన్‌గా పిలిచినా పిలవక పోయినా వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం అని చెప్పే డైలాగ్ తో టీజర్‌ మొదలవుతుంది. సినిమాలోని ఓ పాపులర్‌ స్టాండప్‌ కమేడియన్‌ స్టాండప్‌ కామెడీకీ  ఓరిజినాలిటీ చాలా ముఖ్యమని చెబుతుంటాడు. కానీ రాజ్‌తరుణ్‌  ఔట్‌ డేటేడ్‌ జోక్స్‌ వినిపిస్తూ తన చుట్టూ ఉన్న వారిని విసిగిస్తూన్నట్లు టీజర్లో కనిపిస్తుంది. ఇక బాత్‌రూమ్ సన్నివేశంలో రాజ్‌ తరుణ్, హీరోయిన్ వర్షా బొల్లమ్మల మధ్య సన్నివేశం హాస్యభరితంగా ఉంటూ సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తిని పెంచేలా ఉంది. ఇక ఈ చిత్రంలో నవ్వించాలంటే ముందు ఏడుపేంటో తెలియాలి అనే డైలాగ్ అలాగే వెన్నెల కిశోర్‌ క్యారెక్టర్‌ ఫుల్ హిలేరియస్‌గా ఉంది

టీజర్‌ చాలా ఫ్రెష్‌గా ఉంటూ సినిమాపై ప్రేక్షకుల అంచనాలను పెంచేసింది. రాజ్‌తరుణ్‌ పెర్ఫార్మెన్స్‌ బాగుంది. దర్శకుడు సాంటో మోహన్‌ వీరంకి ఓ ఆసక్తికరమైన సబ్జెక్ట్‌తో రాజ్‌తరున్‌తో ఓ మంచి సినిమా తీస్తున్నారు.

ఇది జీవితంలో దేనికోసం కచ్చితంగా నిలబడని ఒక వ్యక్తి  నిజమైన ప్రేమను కనుగొని, తన తల్లిదండ్రుల కోసం మరియు అతని ప్రేమ కోసం స్టాండ్‌–అప్‌ కామెడీ పట్ల ఉన్న తన అభిరుచిని చాటుకునే  స్టాండ్‌–అప్‌ కామిక్‌ కథ. ఈ సినిమాలో రాజ్‌ తరుణ్‌ సరసన వర్షా బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రాజ్‌తరుణ్‌ పోషిస్తున్న పాత్ర మాదిరిగానే వర్ష కూడా శ్రేయా రావు అనే స్టాండప్‌ కమెడియన్  రోల్‌ చేస్తుంది. 

Stand Up Rahul teaser released :

Rana releases Stand Up Rahul teaser

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ