గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్(98) ఈ రోజు ఉదయం ముంబై లోని హిందూజా హాస్పిటల్ లో కన్నుమూశారు. దిలీప్ కుమార్ అసలు పేరు మహ్మద్ యూసఫ్ ఖాన్. సినిమాల్లోకి వచ్చాక ఆయన పేరుని దిలీప్ కుమార్ గా మార్చుకున్నారు. ఇక గత కొద్ది రోజులుగా శ్వాస సమస్యల తో భాధ పడుతున్న దిలీప్ కుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. గతనెల ఆరో తేదీన శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో దిలీప్ ముంబై లోని హిందూజా ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం పరిస్థితి విషమించడంతో 7.30నిమిషాల ప్రాంతంలో దిలీప్ కుమార్ మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. దిలీప్ కుమార్ మృతితో బాలీవుడ్ శోక సముద్రంలో మునిగిపోయింది. ఓ లెజెండరీ యాక్టర్ ని కోల్పోయామని, బాలీవుడ్ సినీ ప్రముఖులే కాదు.. టాలీవుడ్ నుండి యంగ్ ఎన్టీఆర్, ఇంకా టాప్ డైరెక్టర్స్, టాప్ హీరోలు, నటులు సోషల్ మీడియాలో దిలీప్ కుమార్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.