Advertisementt

నాని శ్యామ్‌సింగ‌రాయ్ ఫైన‌ల్ షెడ్యూల్‌.

Thu 01st Jul 2021 05:24 PM
hero nani,nani shyam singha roy,shyam singha roy last shooting schedule,hyderabad  నాని శ్యామ్‌సింగ‌రాయ్ ఫైన‌ల్ షెడ్యూల్‌.
Shyam Singha Roy Last Shooting Schedule Begins In Hyderabad నాని శ్యామ్‌సింగ‌రాయ్ ఫైన‌ల్ షెడ్యూల్‌.
Advertisement
Ads by CJ

నేచుర‌ల్‌స్టార్ నాని శ్యామ్‌సింగ‌రాయ్ ఇటీవ‌లి కాలంలో ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఒక‌టి. ఇప్ప‌టికే విడుద‌లైన నాని ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌, ఇటీవ‌ల రిలీజైన సాయిప‌ల్ల‌వి ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఒక యూనిక్ స్టోరీతో తెలుగు ఆడియ‌న్స్‌కి ఒక కొత్త ఎక్స్‌పీరియ‌న్స్ ఇచ్చే విధంగా ద‌ర్శ‌కుడు రాహుల్ సంక్రిత్యాన్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. 

ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా సార‌థ్యంలో ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో 10ఎక‌రాల స్థ‌లంలో నిర్మించిన భారీ కోల్‌క‌తా సెట్ హైద‌రాబాద్‌లో కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా దెబ్బ‌తింది. ఆ సెట్‌ను పున‌ర్నిర్మించి కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తున్నారు. నాని స‌హా ఇత‌ర తారాగ‌ణం ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సంద‌ర్భంగా మేకర్స్ విడుద‌ల చేసిన పోస్టర్‌లో నాని లుక్ ఆక‌ట్టుకుంటుంది. 

ఫ‌స్ట్‌టైమ్ నాని, రాహుల్ సంకృత్యాన్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ఈ మూవీలో నాని స‌రికొత్త రూపాల‌లో క‌నిపించ‌నున్నారు. 

Shyam Singha Roy Last Shooting Schedule Begins In Hyderabad:

Nani Shyam Singha Roy Last Shooting Schedule Begins In Hyderabad

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ