Advertisementt

నార‌ప్ప‌ సెన్సార్ ఫినిష్

Tue 29th Jun 2021 06:34 PM
narappa movie,venkatesh,venkatesh naarappa,sreekanth addala - venkatesh prakash,raj,priyamani,rajiv,kanakala,censor board members watched narappa,narappa u/a certificate  నార‌ప్ప‌ సెన్సార్ ఫినిష్
Narappa gets censored నార‌ప్ప‌ సెన్సార్ ఫినిష్
Advertisement
Ads by CJ

హీరో వెంకటేష్ తన దశాబ్దాల సుదీర్ఘ సినీకెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్‌తో విక్టరీని ఇంటిపేరుగా  మార్చుకున్నారు. విక్ట‌రి వెంక‌టేష్ హీరోగా మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం నార‌ప్ప‌. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  

విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో నార‌ప్ప భార్య సుందరమ్మగా తెలుగు వారికి  చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు.

ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌ గ్లిమ్స్‌, పోస్టర్స్‌తో పాటు ‌విక్ట‌రీ వెంక‌టేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజైన నార‌ప్ప టీజ‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు సినిమా చూసి యూనిట్ సభ్యులను ప్రశంసించారు. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ మూవీలో డిఫ‌రెంట్‌ షేడ్స్ ఉన్న పాత్రల‌లో విక్ట‌రి వెంకటేష్ కనిపించనున్నారు. అలాగే త‌న అద్భుతమైన నటనతో ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌నున్నారు. వెంకటేష్‌ను ఇంత‌వ‌ర‌కూ మ‌నం చూడ‌ని ఒక కొత్త‌ అవతారంలో చూపించ‌నున్నారు ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ అడ్డాల. అలాగే ఆయ‌న మేకింగ్ ఈ సినిమాకి బిగ్ అసెట్ కానుంది.

Narappa gets censored:

Venkatesh Narappa gets censored

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ