హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం హీరో, బిగ్ బాస్ ఫేమ్ వరుణ్ సందేశ్ చాలా ఏళ్ళ తర్వాత ఇందువదన సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్ సందేశ్. ఈ మధ్యనే విడుదలైన ఇందువదన ఫస్ట్ లుక్ చాలా కళాత్మకంగా ఉండటంతో అనూహ్యమైన స్పందన వస్తుంది. అందులో వరుణ్ సందేశ్, ఫర్నాజ్ లుక్ కథాపరంగా చాలా అద్భుతంగా డిజైన్ చేసారు దర్శకుడు MSR. విడుదలైన క్షణం నుంచే ఇందువదన లుక్‌కు మంచి స్పందన వస్తున్నందుకు చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉండటమే కాకుండా, వరుణ్ సందేశ్ కూడా ఇందువదన సినిమా కోసం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలో వరుణ్ సందేశ్ పోషిస్తున్న వాసు పాత్రకి సంబంధించిన లుక్ విడుదలైంది, అలానే ఫర్నాజ్ శెట్టి పోషిస్తున్న ఇందు పాత్రకి సంబంధించిన లుక్ కూడా టీమ్ ఇందువదన విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఇటీవలే పూర్తియింది, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ సారధి స్టూడియోస్ లో భారీగా వేసిన సెట్స్ లో ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ జరిగింది.