Advertisementt

మఠంలో మరో ట్విస్ట్‌

Sat 26th Jun 2021 01:29 PM
bramham gari matham,maha lakshmi  మఠంలో మరో ట్విస్ట్‌
Another twist in the Brahmamgari Matam మఠంలో మరో ట్విస్ట్‌
Advertisement
Ads by CJ

కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. బ్రహ్మంగారి మఠం దివంగత 12వ పీఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పీఠాధిపత్యం విషయంలో తనతో ఇంతవరకు చర్చించలేదన్నారు. పెద్ద భార్య కుమారులైన వెంకటాద్రి స్వామి, వీరభద్ర స్వామి మాత్రమే ఎమ్మెల్యేతో సమావేశమయ్యారని, సాయంత్రం తనతో చర్చిస్తామని మాత్రమే ఎమ్మెల్యే తెలిపాని అమె పేర్కొన్నారు. అంతే తప్పితే ఇప్పటి వరకు ఎలాంటి ఏకాభిప్రాయంకు రాలేదని చెప్పారు.  ఇప్పటి వరకు తాను పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామికి మద్దతు పలకలేదని తెలిపారు. వెంకటాద్రి స్వామి, వీరభద్ర స్వామి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.  తనకు న్యాయం జరిగితే మాత్రమే ఏకాభిప్రాయానికి వస్తానని స్పష్టం చేశారు. తన నిర్ణయాన్ని సాయంత్రం ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, దేవాదాయశాఖ అధికారితో చర్చించిన అనంతరం ప్రకటిస్తానని పేర్కొన్నారు.

Another twist in the Brahmamgari Matam:

Another twist in the Brahmamgari Matam

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ