Advertisementt

కార్తికేయ పవర్ ఫుల్ టైటిల్

Sun 20th Jun 2021 01:03 PM
hero kartikeya,kartikeya movie new title,karthikeya raja vikramarka,raja vikramarka title,raja vikramarka movie,raja vikramarka movie title  కార్తికేయ పవర్ ఫుల్ టైటిల్
Kartikeya new film Titled Raja Vikramarka కార్తికేయ పవర్ ఫుల్ టైటిల్
Advertisement
Ads by CJ

ఆర్ఎక్స్ 100తో ప్రేక్షకుల మనసు దోచిన యువ కథానాయకుడు కార్తికేయ. అమ్మాయిలు అతడితో ప్రేమలో పడ్డారు. అబ్బాయిలు లవ్ ఫెయిల్యూర్ సన్నివేశాల్లో అతడి బాధను ఫీలయ్యారు. పాత్ర, అందులో భావోద్వేగాలు కనిపించేలా నటించడం కార్తికేయ ప్రత్యేకత. జయాపజయాలకు అతీతంగా ప్రతి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు. కార్తికేయ డ్యాన్సులు, ఫైట్లు బాగా చేస్తారని.. భావోద్వేగాలు అద్భుతంగా పలికిస్తారని ప్రశంసలు అందుకున్నారు. గ్యాంగ్ లీడర్ లో స్టయిలిష్ విలన్‌గానూ మెప్పించారు. ఇప్పుడు యాక్షన్ ఎంటర్టైనర్ రాజా విక్రమార్కతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో 88 రామారెడ్డి ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. హీరోగా కార్తికేయ 7వచిత్రమిది. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగాపరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి  రాజావిక్రమార్క టైటిల్ ఖరారు చేశారు. అలాగే, సినిమాలో హీరో ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. టైటిల్ ప్రకటనతో పాటు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్  ను అర్జున్ రెడ్డి,కబీర్ సింగ్ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆదివారం సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత 88 రామారెడ్డి మాట్లాడుతూ టైటిల్ తో  పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన ప్రముఖ దర్శకులు సందీప్ రెడ్డి వంగా  గారికి మా కృతజ్ఞతలు. ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్. కార్తికేయ నటన, పాత్ర చిత్రణ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కథకు, హీరోకు పర్ఫెక్ట్ టైటిల్ రాజావిక్రమార్క. టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌కు ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన లభిస్తోంది. ముఖ్యంగా కార్తికేయ లుక్ అందరికీనచ్చింది. సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే  చిత్రమది. చిత్రీకరణ చాలావరకూ పూర్తయింది. లాక్‌డౌన్ ఆంక్షలు పూర్తిగా సడలించినతర్వాత మిగతా భాగం పూర్తి చేసి, ఆ తర్వాత విడుదల వివరాలు వెల్లడిస్తాం అని అన్నారు. 

దర్శకుడు శ్రీ సరిపల్లి మాట్లాడుతూ సినిమాలో కొత్తగా ఎన్.ఐ.ఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ఏజెన్సీ)లో జాయిన్ అయిన అధికారిగా హీరో కార్తికేయ కనిపిస్తారు పాత్రలో ఆయన ఒదిగిపోయి నటించారు.  యాక్షన్ సన్నివేశాలను స్పెషల్ గా డిజైన్ చేశాం. అవి ప్రేక్షకులకుథ్రిల్ ఇస్తాయి. సీనియర్ తమిళ నటులు రవిచంద్రన్ గారి మనవరాలు తాన్యా రవిచంద్రన్ను ఈ సినిమాతో తెలుగు పరిశ్రమకు కథానాయికగా పరిచయం చేస్తున్నాం. హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలు క్యూట్ గా ఉంటాయి.  యువ సంగీత దర్శకుడు ప్రశాంత్ఆర్. విహారి మంచి బాణీలు అందించారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం అని అన్నారు. 

Kartikeya new film Titled Raja Vikramarka:

Hero Kartikeya new film Titled Raja Vikramarka

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ